Publish Date:Aug 12, 2022
ప్రముఖ రచయత సల్మాన్ రష్దీపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ‘ది శాటనిక్ వర్సెస్’ పుస్తకం వివాదాస్పదమైంది. సల్మాన్ రష్దీ దైవ దూషణ చేశారంటూ ముస్లింలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ ఆయనపై ఫత్వా విధించింది. రష్దీని ఖతం చేసిన వారికి 3 మిలియన్ డాల్లర్లు నజరానా ప్రకటిస్తూ ఇరాన్ నజరానా ప్రకటించింది. ముస్లింల నుంచి బెదరింపులు ఎదుర్కొంటున్న రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది.
న్యూయార్క్ లోని ఒక విద్యా సంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా ప్రేక్షకుల్లోంచి వేదికపైకి దూసుకు వచ్చిన ఒక అగంతకుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు. భారత సంతతికి చెందిన రష్దీ ముంబైలో 1947లో రష్దీ జన్మించారు. ఆ తరువాతి కాలంలో బ్రిటన్ కు తరలి వెళ్లారు. 1981లో ఆయన రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలు లభించాయి. ఆ తరువాత 1988లో ఆయన రచించిన ‘ది శైటానిక్ వర్సెస్’ వివాదాస్పదమైంది.
పలు ఇస్లామిక్ సంస్థలు ఆయన పై మండి పడ్డాయి. ఆయనను హత్య చేస్తామంటూ బెదరింపులు కూడా వచ్చాయి. ఇరాన్ అయితే తమ దేశంలో దిశాటినిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా రష్దీ పై ఫత్వా కూడా విధించింది. దీంతో ఆయన దాదాపు దశాబ్దం పాటు పూర్తిగా ఆజ్ణాతంలో ఉన్నారు.
ఆయన ఎక్కడ ఉంటున్నదీ కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనీయలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై న్యూయార్క్ లో దాడి జరిగింది. వేదికపైకి దూసుకు వచ్చిన అగంతకుడు కత్తితో ఆయన మెడపై పొడిచాడు. వెంటనే ఆయన కుప్పకూలిపోయారు. దాడికి పాల్పడిన అగంతకుడిని వేదికపై ఉన్న వారు పట్టుకున్నారు. కుప్పకూలిన రష్దీని హుటాహుటిన హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరలించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/attack-on-salman-rashdi-writer-od-satanic-verdus-25-141835.html
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.