ఆసియా క‌ప్‌..   భార‌త్  హ్యాట్రిక్ సాధిస్తుందా?

Publish Date:Aug 25, 2022

Advertisement

త్వ‌ర‌లో ఆసియాక‌ప్ టి-20 టోర్నీ ఆరంభానికి దుబాయ్ సిద్ధ‌మ‌యింది. ఐసిసి పురుషుల టి20 ప్ర‌పంచ క‌ప్ కూడా ఆట్టే దూరంలో లేదు గ‌నుక ఈ టోర్నీకి ప్రాధాన్య‌త ఉంది. ఈ టోర్నీలో భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య‌నే ఎక్కువ పోటీ క‌న‌ప‌డుతుంది. ఆసి యా అన‌గానే ఈ రెండు దిగ్గ‌జాల‌కే క్రికెట్ వీరాభిమానులు అమితంగా ఇష్ట‌పడ‌తారు. గ‌తేడాది ఐసిసి ప్ర‌పంచ‌క‌ప్ పురుషుల టి 20 క‌ప్‌తో ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్ 19 ప‌ర్యాయాలు గెలిచింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్రావిడ్‌ల సార‌ధ్యం మ‌ద్ద‌తు అమితంగా ప‌నిచేశాయ‌ని క్రికెట్ పండితులు, విమ‌ర్శ‌కుల మాట‌. అయితే ఈసారి ఆసియాక‌ప్‌కు ద్రావిడ్ స్థానంలో వి.వి. ఎస్‌.లక్ష్మ‌ణ్‌ను కోచ్‌గా నియ‌మించారు.  భార‌త్ హ్యాట్రిక్ సాధిస్తుంద‌న్న ఆశ‌లు యావ‌త్ ప్ర‌పంచ క్రికెట్ అభిమానులూ వ్య‌క్తం చేస్తున్నారు. 

ఈ ప‌ర్యాయం కూడా భార‌త్‌కే ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాటింగ్‌తో పాటు వాట్స‌న్ కూడా అభిప్రాయ ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఆగ‌ష్టు 28న భార‌త్‌, పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి. పాకిస్తాన్ కంటే భార‌త్ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ గ‌ట్టి స‌త్తా ప్ర‌ద ర్శించ‌డానికే అవ‌కాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా భార‌త్ రెట్టింపు ఉత్సాహంతో, గెలుస్తామ‌న్న గొప్ప కాన్ఫిడెన్స్ ప్ర‌ద‌ర్శి స్తూ, ప‌ట్టుద‌ల‌తో ఆడ‌టం గ‌మ‌నిస్తాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్ వంటివారు ఎంతో ధాటిగా ఆడి జ‌ట్టు శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను రెండింత‌లు పెంచే తీరు చూడ‌చ‌క్క‌నిది. అయితే ఇటీవ‌ల అంత‌గా ఫామ్‌లో లేని కోహ్లీ ఈ టోర్నీలో త‌ప్ప‌కుండా పాత విరాట్ విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డ‌ని వీరాభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అత‌ను భార‌త్‌కి కేవ‌లం 16 మ్యాచ్‌లే అడాడు. వాటిలో ఒక్క‌టే టీ 20 కావ‌డం గ‌మ‌నార్హం. అదీ జూలై లో ఇంగ్లాండ్ మీద ఆడింది.  ఈ మ‌ధ్య సిరీస్‌ల‌కు విశ్రాంతి తీసుకోవ‌డం కోహ్లీకి ఒక‌విధంగా మంచిదేన‌ని, ఇపుడు ఫ్రెష్‌గా బ‌రిలోకి దిగి ఎంతో కాన్ఫిడెన్స్‌గా ఆడ‌టానికి అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ క్రికెట్ సీనియ‌ర్లు న‌మ్ముతున్నారు. 

జట్టు విష‌యానికి వ‌స్తే.. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో రాహుల్,విరాట్‌,సూర్య‌కుమార్ యాద‌వ్‌, రిష‌బ్‌,దీప‌క్ హుడా,దినేష్ కార్తి క్‌, హార్దిక్ పాండ్యా,ర‌వీంద్ర‌జ‌డేజా, ఆర్‌.అశ్విన్‌, య‌జువేంద్ర‌ఛాహ‌ల్‌, ర‌వి విష్ణోయ్‌, భువ‌నేశ్వ‌ర్‌,అర్ష‌దీప్‌సింగ్, ఆవేశ్‌ఖాన్ ఆడ‌ను న్నారు. స్టాండ్‌బైలుగా శ్రేయాష్ అయ్య‌ర్‌, ఆక్ష‌ర్‌ప‌టేట్‌, దీప‌క్ చాహ‌ర్ ఉన్నారు. కాగా వీరిలో ర‌న్‌మిష‌న్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉండటం జ‌ట్టుకు కొండంత అండ‌గా చెప్పాలి. చిత్రమేమంటే ఎప్పుడూ అంత‌గా క‌నిపించ‌ని దూకుడు త‌త్వం ప్ర‌ద‌ర్శిం చ‌డం గ‌మనార్హం. ఇది ప్ర‌స్తుత టోర్నీకి ఎంతో అవ‌స‌ర‌మ‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ స్ట్ర‌యిక్ రేట్ కూడా 142 ఉండ‌టం ఈ టోర్నీకి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. కెప్టెన్‌ శ‌ర్మ‌తో పాటు ఓప‌నింగ్ కి దిగితే ప‌వ‌ర్‌ప్లే అత్యంత ఆస‌క్తిక‌ రంగా సాగు తుంద‌నే అనాలి. ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కండా వీరిద్ద‌రూ దీపావ‌లి ఆనందాన్నిస్తారు. విశ్రాంతి త‌ర్వాత తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన కోహ్లీ, ఇప్ప‌టికే ఉత్త‌మ ఫామ్‌లో ఉన్న సూర్య‌కుమార్‌లు మిడిల్ ఆర్డ‌ర్‌ను మ‌రింత దూకుడుగా ముందుకు తీసికెళ్లి మంచి స్కోర్ ఖాయిలా చేయ‌వ‌చ్చు. చివ‌ర‌లో దినేష్ కార్తిక్ బ్యాటింగ్ విధానం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఐపిఎల్‌లో అత‌ను ఆ స‌త్తాను ఇప్ప‌టికే ప్ర‌ద‌ర్శించాడు. అందువ‌ల్ల దినేష్‌, రిష‌బ్‌ల మ‌ధ్య మంచి పోటీనే చూడ‌గ‌ల‌మ‌ని అనాలి. వారిద్ద‌రూ ఐపిఎల్‌లో ధాటిగా ఆడ‌టం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న‌వారే. వారిద్ద‌రికి ప్ర‌త్య‌ర్ధుల బౌలింగ్‌ను నీరుగార్చ‌డంలో ఎంతో పేరుంది. ఇక బౌలింగ్ విభాగానికి వ‌స్తే, చాహ‌ల్ త‌ప్ప‌కుండా లీడ్ బౌల‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడు. అత‌ను కేవ‌లం 7.06 ఎకాన‌మీతో 13 మ్యాచ్‌లో ఏకంగా 16 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో త‌న స‌త్తాను చాట‌డంలో ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించాడు. అయితే, పేస్ అటాక్‌లో బుమ్రా, పాండ్యాలు మ‌రిం విజృంభించాల్సి ఉంది. అలాగే పేసర్ల‌లో లీడ్‌గా ఉన్న భువ‌నేశ్వ‌ర్‌పైనా ఎన్నో ఆశ‌లు ఉన్నాయి. ఈ ఏడాది ఎలాంటి గాయాల‌కు గురికాలేదు గ‌నుక అత‌ను ఐపీఎల్‌లోనూ ఎంతో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు గ‌నుక అత‌ని మీదా ఆశ‌లు ఉన్నాయి.

ఈసారి బాబ‌ర్ అజామ్‌, మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్‌లతో ప‌టిష్టంగా ఉన్న పాకిస్తాన్‌తో పాటు శ్రీ‌లంక జ‌ట్టు కూడా భార‌త్‌కు గ‌ట్టి పోటీ నిచ్చే అవ‌కాశాలున్నాయ‌ని క్రికెట్ మేధావులు అంటున్నారు. అలాగే అంత‌ర్జాతీయ కూన‌లుగా పేర్కొంటున్న ఆప్ఘ‌నిస్తాన్ జ‌ట్టు బౌలింగ్ లైన్ ఆప్ ఈసారి ఇబ్బందిపెట్టే అవ‌కాశాలున్నాయి. ఇటీవ‌ల ఇర్లాండ్ తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో ఓట‌మి చ‌విచూసిన‌ప్ప‌టికీ ఆఫ్ఘ‌న్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌న‌వ‌స‌రం లేదు. 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.