ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా?

Publish Date:Oct 18, 2022

Advertisement

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? 2014 ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడుస్తున్నాయా.. ఇందుకు బీజం   చాలా కాలం కిందటే పడిందా. అందుకు సంబంధించి ఇప్పుడు ఒక స్పష్టత వస్తోందా అంటే వరసగా గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనక తప్పదు.

విశాఖ గర్జన సందర్భం గా విశాఖపట్నం విమానాశ్రయం వద్ద జరిగిన ఘర్షణ, అది సాకుగా తీసుకుని పోలీసులు జనసైనికులపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అంతటితో ఆగకుండా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నోవాటెల్ హోటల్ దాటి బయటకు రాకుండా అడ్డుకోవడం, ఆంక్షల పేరు చెప్పి జనవాణి జరగకుండా ఆపడం వరకూ ప్రతి సంఘటనా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రెండు రోజుల పాటు విశాఖలో నోవాటెల్ హోటల్ కే పరిమితమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అన్ని రాజకీయ పార్టీలూ మద్దతుగా నిలిచాయి. సంఘీభావం ప్రకటించాయి.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పవన్ కల్యాణ్ తో మాట్లాడారు. విశాఖ ఘటనలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. జనసేన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే ఇటీవల కొద్ది కాలంగా జనసేనతో అంటీముట్టనట్టున్న మిత్రపక్ష బీజేపీ కూడా విశాఖ ఘటనల నేపథ్యంలో జనసేనకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా జనసేన తమ మిత్రపక్షమని ఎలుగెత్తింది. వామపక్షాలు కూడా జనసేనకు అండగా ఉంటామని ప్రకటించాయి.  ఇప్పుడు విశాఖ సీన్ విజయవాడకు మారింది. విశాఖ నుంచి తిరిగి వచ్చిన జనసేన అధినేత ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో బేటీ అయ్యారు.

అలాగే విజయవాడ నోవాటెల్ హోటల్ లో జనసేనానిని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కలిశారు. విశాఖ ఘటనలపై ఆరా తీశారు. ప్రభుత్వ నిర్బంధాన్ని, నియంతృత్వాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలన్న దిశగా వారి మధ్య చర్చ జరిగిందని సమాచారం. అలాగే అమరావతి రైతుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన ఇరు పార్టీలూ ఇకపై కలిసికట్టుగా అమరావతి రైతుల పక్షాల గళమెత్తాలని కూడా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  

భవిష్యత్ లో ఈ సంఘీభావం ఎన్నికల పొత్తు కు దారి తీస్తుందా అన్న చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాలలో ప్రారంభం అయ్యింది. కొద్ది కాలం కిందట అంటే రాష్ట్ర పతి ఎన్నిక సందర్భంగా బెజవాడలో ముర్ముతో టీడీపీ నేతల భేటీ వద్దంటూ వైసీపీ  బీజేపీపై ఎంత  ఒత్తిడి తసుకు వచ్చినా వినకుండా  ఆమెతో టీడీపీ నేతల భేటీ కి సోము వీర్రాజు వంటి నేతలు స్వయంగా పూనుకోవడం,  చంద్రబాబుకు   12+12 ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ పెంచడం వీటన్నిటినీ కలిపి చూస్తే రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు దగ్గరౌతున్నాయనడానికి తార్కానంగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే గతంలో ఢిల్లీలో  మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి కేంద్రం నుంచి అందిన ఆహ్వానం మేరకు  చంద్రబాబు  హస్తిన వెళ్లడం, ఆ సందర్బంగా కొద్ది సేపు మోడీతో ముచ్చటించడాన్ని కూడా పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

 

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ నేతల సమావేశం ఉద్రిక్తంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.