నాలుగు నామినేషన్లూ సక్రమమే!

Publish Date:Jun 9, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం (జూన్ 9) అధికారికంగా పూర్తయింది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు  నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి,  అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి  ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 18 న జరగబోయే ఈ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరి పత్రాలు చెల్లుబాటు కావడంతో తదుపరి ప్రక్రియకు మార్గం సుగమమైంది.

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున నలుగురు ప్రముఖ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.  

అదేవిధంగా, కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కోటా కింద ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తన నామినేషన్   దాఖలు చేశారు. మొత్తం 4 స్థానాలకు గానూ కూటమి తరఫున ఈ నలుగురు అభ్యర్థులు మాత్రమే  బరిలో నిలిచారు. దీంతొ  ఈ నలుగురు అభ్యర్థుల ఎన్నిక కగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.  

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.