Publish Date:Nov 11, 2024
వివాదాలకు కేంద్రం అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ లో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టులు, ప్రత్యర్థులపై దూషణలకు పాల్పడిన వారిపై ఇటీవల ఏపీ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ఫిర్యాదు అందగానే పోలీసులు రియక్ట్ అవుతున్నారు. జగన్ హయాంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ బూతుల కర్మాగారంగా మారిపోయి.. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నేతలపై అసభ్య పోస్టులు, మార్ఫింగ్ తో రెచ్చిపోయింది. అలా రెచ్చిపోయిన వారికి అప్పటి సీఎం జగన్ ప్రోత్సాహం, అండదండలు ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. జోగి రమేష్ వంటి వారికి కేబినెట్ లో స్థానం లభించడం వంటి సంఘటనలు ఆ విమర్శలకు బలం చేకూర్చేవిగా ఉండేవి.
అలా సోషల్ మీడియాలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులతో రెచ్చిపోయిన వారిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. వహించిన జగన్ అధికారంలో ఉన్నంత కాలం రామ్ గోపాల్ వర్మ హద్దూ, అదుపూ లేకుండా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అప్పట్లో జగన్ కోసం ఆయన దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్ల పేరు చెప్పి చంద్రబాబు నాయుడు , లోకేష్, నారా బ్రాహ్మణి పైన వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టులు పెట్టారు.
వీటిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన టీడీపీ నాయకుడు రామలింగ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేశారు. కాగా గతంలో వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా రాంగోపాల్ వర్మ చంద్రబాబును పదేపదే టార్గెట్ చేశారు. ఏకంగా చంద్రబాబును నెగిటివ్ క్యారెక్టర్ గా తన సినిమాలలో చూపిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో కూడా చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-police-regester-case-on-ramgopal-verma-25-188198.html
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.