రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ.!

Publish Date:Aug 6, 2026

Advertisement

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది.  గత వైసీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. ఇప్పుడు అంటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి ఆరు రెట్టు అధికంగా విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయి. ఈ విషయాన్ని కేంద్రం లోక్ సభ వేదికగా ప్రకటించింది.  రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి లభిస్తున్న మద్దతు,   ఆ రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల కారణంగానే  విదేశీ ఇన్వెస్టర్లు ఏఫీపై ఆసక్తి చూపుతున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొంది.   2023-24   ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 92.13 మిలియన్ డాలర్ల విదేశీ  ప్రత్యక్ష  పెట్టుబడులు రాగా, ఆ తరువాతి ఆర్థిక సంవత్సరంలోఇవి  233.14 మిలియన్ డాలర్లకు పెరిగాయి.

ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరిగి 608.59 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పెట్టుబడుల పరిమాణం ఆరు రెట్లకు పైగా పెరగడం రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి అద్దం పడుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు రాష్ట్రానికి పెట్టుబడులు ఏ రీతిలో తరలివస్తున్నాయో స్పష్టంగా చూపుతున్నాయి.

వైసీపీ హయాంలో  పారిశ్రామిక విధానాల్లోని అనిశ్చితి, అస్థిరత వల్ల రాష్ట్రం వైపు ఇన్వెస్టర్లు కన్నెత్తి చూడని పరిస్థితి ఉండేది.  అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత.. పరిస్థితిలో సమూల మార్పు వచ్చిందని కేంద్రం పేర్కొంది. 

వివిధ రంగాల వారీగా  రాష్ట్రానికి తరలి వచ్చిన విదేశీ పెట్టుబడుల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభ ముందుంచింది.  2025-26 ఆర్థిక సంవత్సరంలో  మెటల్) రంగానికి 250.67 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రాన్ని లోహ తయారీ, రవాణా రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ఈ పెట్టుబడులు ఎంతగానో దోహదపడుతున్నాయి.

అదే విధంగా..  ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి 107.30 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరగా, సిమెంట్ ఉత్పత్తుల రంగానికి 99.90 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు లభించాయి.  వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, మౌలిక వసతుల కల్పనకు ఊతమిచ్చే రంగాలలో విదేశీ పెట్టుబడులు భారీగా రావడం వల్ల స్థానిక యువతకు   ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

గతంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రతికూల వవాతావరణం నెలకొందని, అయితే ప్రస్తుత  తెలుగుదేశం కూటమి పాలనలో పారిశ్రామిక వేత్తలలో , ఇన్వెస్టర్లలో రాష్ట్రంపై గురి కుదిరిందనడానికి ఎఫ్డీఐలలో పెరుగుదలే నిదర్శనం అనడంలో సందేహం లేదు.   కేంద్రం వెల్లడించిన ఈ  గణాంకాలతో రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు మరింతగా తరలివస్తాయని, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడమే కాకుండా సమగ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

AP Foreign Investment 6X, Andhra Pradesh FDI Growth, Union Finance Ministry, Lok Sabha Data, AP Metal Sector Investment, Food Processing FDI Andhra Pradesh 

By
en-us Political News

  
హైదరాబాద్ బోనాల జాతర.. భక్తుల సందడి.. కిక్కిరిసిన రహదారులు.. ఇదే అదనుగా మహిళలను వేధిస్తూ రెచ్చిపో తున్న ఆకతాయిలకు షీ టీమ్స్‌ చెక్ పెట్టాయి.
ప్రపంచ ఇంటర్నెట్ రంగంలో ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన! స్టార్‌లింక్ V3 శాటిలైట్లు మరియు స్టార్‌షిప్ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 రెట్లు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కొత్త డెల్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? టెక్ నిపుణులు పరీక్షించి 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన డెల్ ఎక్స్‌పిఎస్, ఇన్‌స్పిరాన్, ఏలియన్‌వేర్ మరియు బడ్జెట్ ఆఫర్ మోడల్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఉద్యోగాల ఎంపికలో ఏఐ వినియోగంపై నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. 64% మంది ఏఐ స్క్రీనింగ్‌ను, 70% మంది ఆన్‌లైన్ ఇంటర్వ్యూలను వ్యతిరేకిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది! పెళ్లి చేసుకునే మహిళలకు 8 గ్రాముల బంగారం, పుట్టిన బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే కొత్త పథకాలను బడ్జెట్‌లో ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మరియు ఎన్‌బీఎఫ్‌సీలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అక్టోబర్ 1 నుంచి అమలుకానున్న కొత్త ఎఫ్‌డీ నిబంధనలు, వడ్డీ రేట్ల పారదర్శకత పూర్తి వివరాలు తెలుసుకోండి.
వాహనదారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిలిపివేసేలా పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదన. కొత్త కార్లు, బైకుల బీమా గడువు పెంపుపై సమగ్ర కథనం.
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ శకలం గంటకు 8,690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడిని ఢీకొట్టింది. 4 టన్నుల బరువున్న ఈ భాగం తాకిడికి చంద్రుడిపై 60 అడుగుల వెడల్పు గల గొయ్యి ఏర్పడింది. ఈ ప్రమాదంపై నాసా ఏం చెబుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం సెస్ విధించేందుకు సిద్ధమవుతోందా? ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 18 అదనపు భారం పడే అవకాశం ఉందా? రూ. 4.30 లక్షల కోట్ల వ్యూహాత్మక ఇంధన నిల్వల ప్లాన్ వివరాలు ఇవే!
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలు విధిస్తే భారాన్ని ఎవరు మోస్తారు? పన్నుల సవరణ బిల్లు 2026 నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇచ్చిన కీలక స్పష్టత మరియు సంపూర్ణ సమాచారం ఇక్కడ చదవండి!
సుదీర్ఘ విరామం తర్వాత లాహోర్ 1947 సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, తన భర్త జీన్ గుడెనఫ్ మరియు కవల పిల్లలు జై, జియాలే తన జీవితంలో మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కుటుంబం, కెరీర్ గురించి ప్రీతీ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు ఇవే!
జగన్ పర్యటనల్లో  వైసీపీ  కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.