ఏపీ ఎన్నికలు మార్చి 6న?!

Publish Date:Nov 24, 2023

Advertisement

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు ఆ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు కూడా వేగంగా చేస్తున్నది. ఆ సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలోనే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ఆరంభించేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయి కార్యాచరణను ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసేసింది. ఈవీఎంలను జిల్లాలకు తరలిచినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు  ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2న విడుదలయ్యే అవకాశాలున్నాయి.  అలాగే ఏపీలో మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 6న ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.  

ఇక ఏపీలో ఓటర్ల జాబితాను సవరించి ముసాయిదాను ప్రకటించడం కూడా పూర్తయిపోయింది. ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ నాటికల్లా వాటిని పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. అసలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని గతంలో విస్తృతంగా ప్రచారం అయ్యింది. అప్పట్లోనే కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసిందని అప్పట్లో రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరిగింది. అసలు ఏడాదిన్నర కిందటి నుంచే ఏపీలోని జగన్ సర్కార్ ముందస్తు ఎన్నికల ముచ్చటను తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల స్వయంగా ఈ విషయాన్ని అప్పట్లో ప్రకటించారు. అయితే తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ముచ్చట మరుగున పడింది. 

వాస్తవానికి జగన్ కూడా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ గా భావిస్తున్న సంక్షేమ పథకాలకు కూడా నిధులు సమకూరు అవకాశం లేని పరిస్థితులు నెలకొనడంతో ఫథకాలు నిలిపివేసి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను మరింత పెంచుకునే కంటే.. అవి కొనసాగుతుండగానే ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందాలని జగన్ భావించినట్లు అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ప్రభుత్వ అడుగులు కూడా ముందస్తు దిశగానే పడుతున్నాయని అప్పట్లో రాజకీయ వర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ముందస్తుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ముందస్తు మాట వెనుకకు వెళ్లి పోయింది. ఈ నేపథ్యంలోనే మూడు నెలల కిందట జగన్ స్వయంగా  వచ్చే ఏడాది మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించి, అందుకు సన్నద్ధం కావాల్సిందిగా పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాటు చేస్తున్నది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే ఏపీలో ఎన్నికల ఏర్పాటుకు కూడా వేగంగా చర్యలు తీసుకుంటోంది. 

 ఏపీలో అసెంబ్లీ ఎన్నికల దిశగా ఇప్పటికే ఈసీ వేగంగా అడుగులేస్తోంది. ముందు జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్న ఈసీ.. అనంతరం కేంద్రం మందుకు రాకపోవడంతో అసెంబ్లీ గడువు ముగిశాక ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆగస్టులో ప్రారంభించిన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించింది. డిసెంబర్ నెలలో  వాటిలో అభ్యంతరాల్ని డిసెంబర్ వరకూ స్వీకరించి అనంతరం వాటిని పరిష్కరించనుంది. ఆ తర్వాత జనవరి మొదటివారంలోనే తుది ఓటర్ల జాబితాను ప్రచురించబోతోంది.

దీని ఆధారంగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోంది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తాజాగా సంకేతం ఇచ్చారు. ఈ లెక్కన మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేవలం షెడ్యూల్ ప్రకటించిన నెల రోజుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలోనూ షెడ్యూల్ ప్రకటన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.