పెట్టుబడుల ఊతంతో ఏపీ ప్రగతి పరుగులు!

Publish Date:Nov 12, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఐదేళ్ల అరాచక పాలన అంతమై.. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి నిండా ఐదు నెలలు పూర్తికాకుండానే.. సన్ రైజ్ స్టేట్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపును సాధించింది. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. బాబు దార్శనికతపై ఇన్వెస్టర్లలో, పారిశ్రామిక వేత్తలలో ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. చంద్రబాబు అంటే సంపదసృష్టికర్త, ఆ సృష్టించిన సంపదను సమాజంలోని అణగారిన వర్గాలకు సంక్షేమంగా అందించాలన్న దృక్ఫథం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన మార్క్ అభివృద్ధిని ప్రపంచానికే రోల్ మోడల్ గా మార్చింది. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో  ఏపీ అభివృద్ధి తిరోగమనంలో పడింది. అస్తవ్యస్థ విధానాలు, అరాచక పాలన, దోపిడీ, దౌర్జన్యం, కక్ష సాధింపు ఇవే ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు సాగాయి. పరిశ్రమలు తరలివెళ్లిపోయాయి. ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ వైపే చూడటం మానేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయింది. ఏపీ ఇమేజ్ దెబ్బతింది. 

2024 ఎన్నికలలో జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత కూడా సర్వత్రా అనుమానాలే. చంద్రబాబు ఏపీకి పోయిన బ్రాండ్ ఇమేజ్ ను మళ్లీ తీసుకురాగలరా? సంపదసృష్టితో అభివృద్ధి సంక్షేమాలను జోడుగుర్రాళ్లీ పరుగులెత్తించగలరా? అన్న సందేహాలను పరిశీలకులు సైతం వ్యక్తం చేశారు. ఎందుకంటే జగన్ ఐదేళ్ల హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇక ఎన్నటికీ తేరుకోలేదన్నంతగా విచ్ఛిన్నమైంది. కానీ చంద్రబాబు తన అనుభవంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. అన్ని విధాలుగా అధోగతి పాలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు.  

ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రిలయెన్స్ ముందుకు వచ్చింది. అంటే దేశంలో గుజరాత్ రాష్ట్రం తరువాత రిలయెన్స్ ఏపీలోనే భారీగా పెట్టుబడులు పెట్టడానికి  రెడీ అయ్యింది. రాష్ట్రంలో 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి రిలయెన్స్ ముందుక వచ్చింది. ఇటీవల ముంబైలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ అనంత్ అంబానీతో భేటీ అయ్యారు. ఆ భేటీ ఫలితమే ఇప్పుడీ పెట్టుబడులు. అలాగే  టాటా పవర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో సౌర, పవన్ విద్యుత్ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది.  అంతే కాకుండా  విశాఖ టిసీఎస్ కంపెనీ కొత్తగా ఐ‌టి డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతోంది. అలాగే టాటా గ్రూప్ ఏపీలో ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. అలాగూ ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల నడిబొడ్డున భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా అక్కడి నించి విమానసేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.