ముంబై అంబానీ ఆస్పత్రిలో చేరిన పవన్.. ఎందుకో తెలుసా?
Publish Date:Jun 30, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని అంబానీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇందు కోసం ఆయన సోమవారం జూన్ 29) ముంబై చేరుకున్నారు. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి విదితమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల కొన్ని నెలల క్రితమే ఆయన కు హైదరాబాద్‌లో నాసల్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భుజాల నొప్పి నివారణ కోసం ఆయన అంబానీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కాగా పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి అనా లెజ్నెవా కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ భుజాల కండరాలు దెబ్బతినడం వల్లే ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆయన కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. పర్యటనల్లో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చుట్టుముట్టడం, తోపులాటలు జరిగిన ఘటనలు కారణంగా ఆయన భుజాల కండరాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. ఈ సమస్యకు చికిత్స కోసమే దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తుందన్న పేరు ఉన్న అంబానీ హాస్పిటల్‌లో ఆయన సోమవారం (జూన్ 29) చేరారు. అంబానీ ఆస్పత్రిలో పవన్‌కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. భుజాల సమస్య తీవ్రతను బట్టి వైద్యులు చిన్న సర్జరీ అవసరమని తేల్చారు.
http://www.teluguone.com/news/content/ap-deputy-cm-joins-amban-hospital-36-224602.html





