ఈ నెల 12న జరగనున్నఉప ఎన్నికలు హైటెక్ స్థాయిని తలపిస్తున్నాయి. ల్యాప్ టాప్ ల హడావుడితోనూ, లైవ్ టెలీకాస్ట్ లతోనూ ఈ ఎన్నికలు హోరెత్తనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానానికి నిలువుటద్దంలా ఈ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. అక్రమాలకూ తావు ఇవ్వకుండా జాగ్రత్తలను తీసుకున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగు వేలమంది ఈ ఉప ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరికి సాంకేతిక సహాయం అందించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి సాంకేతిక నిపుణులు నలుగురిని రాష్ట్రానికి రప్పించింది. వీరితో పాటు హైదరాబాద్ లో ఉన్న మరో ఇద్దరు నిపుణులను కూడా ఎన్నికల కమిషన్ పంపిస్తోంది. నూజివీడు ట్రిపుల్ ఐటి నుంచి 1600మంది, ఆర్కేవాలీ నుంచి 2000మంది, బాసర నుంచి 400మంది ఇంజనీరింగు విద్యార్థులు ఎన్నికలను అంతర్జాలంలో ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు పైన చెప్పిన ఆరుగురు నిపుణులూ నూజివీడు వచ్చారు. ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించటంతో పాటు ఎన్నికల్లో పాల్గొన్నందుకు 500రూపాయలు, మోంటారుకు వెయ్యిరూపాయలు పారితోషికాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పాయకరావుపేట. ఒంగోలు, రామచంద్రపురం, నర్సాపురం, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, కందుకూరు, కావలి ఎన్నికల్లో ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు సేవలందించనున్నారు. అలానే శ్రీకాకుళంలోని 260 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఉంచాలని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-by-polls-2012-24-14677.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.