Publish Date:Aug 26, 2022
చాక్లెట్ బావుందని వెనకటికి ఓ పిల్లాడు చదువు అశ్రద్ధచేసి చాక్లెట్లకోసం పెద్ద బడి దగ్గర దుకాణాన్ని మరిగాట్ట. అలా ఉంది ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యవహారం. చాక్లెట్లు అడిగినంత సులువుగా ఆర్‌బీఐ ని అప్పు అడిగేస్తున్నారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్ సృష్టిస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదు నెలల వ్యవధిలో ఏపీ రూ.46,603 కోట్లు రుణం సమీ కరించిందని, ఏపీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని తెలిపారు. వచ్చే మంగళవారం మరో రూ.2 వేల కోట్లు అప్పుకు ఆర్బీఐ కి ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టిందని జీవీ చెప్పారు.
ఇవికాక కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు అదనంగా తెస్తున్నారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సమస్య లు, విభజన అంశాలపై కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర బృందం తో గురువారం సమావేశమైంది.
రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బృం దంలో ఉన్నారు. ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిందొకటి.. బయటికొచ్చాక విజయసాయి, బుగ్గన చెప్పింది వేరొకటి కావడం గమనార్హం. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా సమకూర్చకపోవడం, డిస్కమ్‌లు చెల్లించా ల్సిన రుణాలపై నివేదికలు ఇవ్వకపోవడం, రైల్వే ప్రాజెక్టులకు నిధులు, భూములు ఇవ్వకపోవడంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aps-economic-situation-is-a-mess-says-tdp-25-142715.html
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
Publish Date:Jul 31, 2026
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక