మహా రాజకీయంలో మరో మలుపు?

Publish Date:Oct 18, 2022

Advertisement

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఉహించడం అంత తేలికైన వ్యవహారం కాదు. అంతవరకు ఉప్పు నిప్పులా ఉన్న పార్టీలు ఒక్కసారిగా చేతులు కలిపెసినా ఆశ్చర్య పోనవసరం ఉండదు. ఇప్పుడు మహా రాష్ట్రలో అదే జరిగింది. బీజేపీ, శివసేన ఒకప్పుడు, సహజ మిత్ర పక్షాలు. ఒక విధంగా ఆ రెండు పార్టీలది ఒకటే డిఎన్ఎ, ఒకటే రక్తం. అందుకే హిందుత్వ బంధంతో ముడి వేసుకున్న ఆ రెండు పార్టీలు, ఎప్పటికీ విడిపోవని, విడిపోయినా మళ్ళీ అదే హిదుత్వ బంధం ఆ రెండు పార్టీలను కలిపేస్తుందనే నమ్మకం రెండు పార్టీలలో బలంగా నాటుకు పోయింది.  

అయితే  అటు శివసేన ఇటు బీజేపీ నాయకత్వంలో తరాల అంతరాలు రావడం రాజకీయ ఆకాంక్షలు పెరగడంతో పరిస్థితి క్రమక్రమంగా మారుతూ వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అయితే, ముఖ్యమంత్రి కుర్చీ విషయంలో వివాదం రావడంతో రెండు పార్టీలు విడిపోయాయి.శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారు. మూడు పార్టీలు కలిసి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అంతర్గత వైరుధ్యాలతో ఎంవిఎ ప్రభుత్వం త్వరలోనే కులిపోతుందని అనుకున్నా, శరద్ పవార్ చలవతో  ఠాక్రే సర్కార్ మూడేళ్ళు పూర్తి చేసుకుంది. అయితే, ఇంతలోనే శివసేనలో ముసలం పుట్టింది. పార్టీ రెండుగా చీలింది.

మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగరేశారు. బీజేపీ తెర వెనక చక్రం తిప్పింది. ఇంచుమించుగా నెలరోజుల పాటు సాగిన నాటకీయ పరిణామాలకు తెర దించుతూ జూన్ 30, 2022 న షిండేముఖ్యమంత్రిగా బీజేపీ, శివసేన ( షిండే) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపధ్యంలో శివసేన ఇరు వర్గాలు బాల్ ఠాక్రే హిందుత్వ వారసత్వం శివసేన పేరు, పార్టీ గుర్తు తమదంటే తమదని నిరూపించుకునేందుకు ఓ వంక రాజకీయ పోరాటాలు, మరో వంక న్యాయ పోరాటం సాగిస్తున్నాయి. ఈ పోరాటంలో  సహజంగానే, బీజేపీ షిండే వర్గానికి కొమ్ము కాస్తోంది. అయితే ఇప్పడు బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక బరిలోంచి తమ అభ్యర్ధి ముర్జీ పటేల్‌ను ఉపసంహరించుకుంది. శివసేన (ఠాక్రే) వర్గం అభ్యర్ధి ఏకగ్రీవ ఎన్నికకు లైన్‌ క్లియర్ చేసింది. ఒక విధంగా బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యమంత్రి షిండే వర్గానికి షాక్. అని చెప్పవచ్చని అంటున్నారు.  అయితే, బీజేపీ, మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా అనుసరిస్తూ వస్తున్న, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంలో, దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఏకగ్రీవ ఎన్నికకు అనుకూలంగా ఇతర పార్టీలు తమ అభ్యర్ధులను బరిలో దించరాదనే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ అభ్యర్ధిని ఉపసంహరించుకున్నామని బీజేపీ ప్రకటించింది.  అయితే, ఈ నిర్ణయం వెనక వ్యూహాత్మక రాజకీయ కోణం దాగుందని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. బీజేపీ ముందుగానే. ఏకగ్రీవ సంప్రదాయాన్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటే అది మరోలా ఉండేది. కానీ, శివసేన రెండువర్గాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా పార్టీ పేరు, సింబల్ ను కేంద్ర ఎన్నికల సంఘం స్తంబింప చేసిన తర్వాత, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉద్ధవ్  ఠాక్రే, అభ్యర్ధన మేరకు. అంటూ చివరి క్షణంలో అభ్యర్ధిని ఉప సంహరించుకోవడంతో కమల దళం వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మహా రాజకీయాలలో చర్చనీయాంశంగ మారిందని అంటున్నారు.

అలాగే, దీర్ఘ కాలంలో హిందుత్వ ఓటు చీలకుండా చూసేందుకు,శివసేన రెండు వర్గాలను ఏకం చేసి అక్కున చేర్చుకునే వ్యూహంతో బీజేపీ కథ నడిపిందని అనుకోవచ్చని అంటున్నారు.  అందుకే  బీజేపీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వెనక  ఇంకేదో రాజకీయం ఉండి మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శివసేనలో చీలిక అనంతరం జరుగుతున్న అంధేరీ ఉప ఎన్నికను శివసేన రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి షిండే వర్గం పోటీలో లేకున్నా, మిత్రపక్షం బీజేపీ అభ్యర్ధిని గెలిపించి, ఠాక్రే వర్గంఫై పైచేయి సాధించాలని వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అయితే, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదన్నట్లుగా, శివసేనను పూర్తిగా కబ్జా చేసేందుకు, షిండే వర్గం సిద్దం చేసుకున్న స్కెచ్ ని బీజేపీ మార్చేసిందని అంటున్నారు.

అయితే అంధేరీ ఉప ఎన్నిక కంటే అత్యంత కీలకం అయిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజీపీ వ్యుహతమక నిర్ణయం తీసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవంక,   శివసేన (ఠాక్రే) వర్గం రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాత్రం,అంధేరీ ఈస్ట్ నియోజక వర్గంలో బీజేపీ నిర్వహించిన సర్వేలో, తమ అభ్యర్ధి ముర్జి పటేల్ ఓటమి తధ్యమని తెలిసిన నేపధ్యంలోనే బీజేపీ రాజ్‌ ఠాక్రేను తెర మీదకు తెచ్చి పోటీ నుంచి తప్పు కుందని అన్నారు. ఏది ఏమైనా, శివసేనను సక్సెస్ ఫుల్ గా ముక్కలు చేసిన బీజేపీ, ఇప్పడు మళ్ళీ  అతుకులను కలిపి కుట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్య  పరుస్తోందని అంటున్నారు.

అయితే, 2024 లోక్ సభ ఎన్నికల నాటికి తెగిన పాత బంధాన్ని మళ్ళీ ముడి వేసి, మహారాష్ట్రలో  హిందుత్వ శక్తులను ఏకం చేసే లక్ష్యంతోనే బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. నిజానికి, అది భయమైనా, భక్తి అనుకున్నా మహారాష్ట్రంలో హిందుత్వ వాదానికి ప్రతీకగా నిలిచిన బాల్  ఠాక్రే వారసత్వాన్ని ముక్కలు చేయడం కమల దళం కోరుకోవడం లేదని బీజేపీ నాయకులు అంగీక రిస్తున్నారు.

By
en-us Political News

  
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.