Publish Date:Apr 16, 2025
ఇటీవల మోదీ సర్కారు ఆమోదించిన వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఇవాళ(బుధవారం) విచారణ ప్రారంభించింది. వక్ఫ్ సవరణ చట్టంపై కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోనే సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
Publish Date:Apr 16, 2025
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్న సంగతి విదితమే.
Publish Date:Apr 16, 2025
Publish Date:Apr 16, 2025
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి 400 ఎకరాల భూముల విషయంలో ఏఐ జనరేటెడ్ ఫొటోని రీపోస్ట్ చేసినందుకు సీనియర్ ఐఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు గచ్చిబౌలి పీఎస్ ఎస్ హెచ్ వో మహ్మద్ హబీబులా ఖాన్ వెల్లడించారు
Publish Date:Apr 16, 2025
ఇటీవలి కాలంలో వార్తలలో నిలిచిన ఎస్వీ గోశాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం (ఏప్రిల్ 16) పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీ గోశాలలో నెలల వ్యవధిలో వందల గోవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.
Publish Date:Apr 16, 2025
భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య సాగరిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారికి ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు....
Publish Date:Apr 16, 2025
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై కాంగ్రెస్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయి నిలదీశారు.
Publish Date:Apr 16, 2025
అదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. పిల్లలు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు.
Publish Date:Apr 16, 2025
ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ ఎన్నికలలో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిల మధ్య పోరా జరగనుంది. ఇప్పటికే ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి కూమార్ యాదవ్ ను కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించేశాయి.
Publish Date:Apr 16, 2025
సినీ ఇండస్ట్రీపై మోజుతో ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి దందాలు వరుసగా బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి దోచుకున్న నల్లధనాన్ని వైట్‌లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు.
Publish Date:Apr 16, 2025
అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం, తాజాగా వారికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసల విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Publish Date:Apr 16, 2025
రాష్ట్రానికి పెట్టబడును ఆకర్షిండమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు రెడీ అయ్యారు. బుధవారం (ఏప్రిల్ 16) రాత్రి ఆయన జపాన్ పర్య టనకు బయలుదేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22 వరకు అంటే ఆరు రోజుల పాటు రేవంత్ జపాన్ లో పర్యటించనున్నారు.
Publish Date:Apr 16, 2025
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం (ఏప్రిల్ 16) సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఈ నెల 18న హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన రెండు రోజుల ముందుగానే విచారణకు హాజరుకానున్నట్లు ఆయన సిట్ కు సమాచారం ఇచ్చారు. ఇందుకు సిట్ అంగీకరించింది. దీంతో ఆయన బుధవారం (ఏప్రిల్ 16)న సిట్ విచారణకు హాజరయ్యారు.