దక్షిణాది రాజకీయాల్లో, ముఖ్యంగా తమిళనాడులో అనూహ్యమైన రాజకీయ పరిణామం సంచలనం రేపుతోంది. తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఫేస్‌గా నిలిచిన ఫైర్‌బ్రాండ్ లీడర్ అణ్ణామలై త్వరలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్త ఇప్పుడు తమిళరాజకీయాలలో సంచలనంగా మారింది. గత దశాబ్ద కాలంగా తమిళనాట కమలం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు శ్రమించిన అణ్ణామలై.. ఇప్పుడు అనూహ్యంగా సొంత పంథాను ఎంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది. కానీ.. ఇటీవలి కాలంలో బీజేపీ అధిష్ఠానంతో ఏర్పడిన తీవ్రమైన సాంస్కృతిక, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా అణ్ణామలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీనియర్ లీడర్ అయిన అణ్ణామలై త్వరలోనే బీజేపీకి త రాజీనామా సమర్పించనున్నారు. పార్టీని వీడిన అనంతరం ఆయన నేరుగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించకుండా, ముందుగా గ్రౌండ్ లెవెల్లో ఒక బలమైన స్వచ్ఛంద ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ లేదా సామాజిక ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్‌ను నిర్మించుకున్న తర్వాత పూర్తిస్థాయి పొలిటికల్ పార్టీని లాంచ్ చేయాలని పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తమిళనాడు ప్రజలు ద్రవిడ సిద్ధాంతాలకు అలవాటు పడి ఉన్నారని, అక్కడ కేవలం బీజేపీ ముద్రతో ఒంటరిగా గెలవడం అసాధ్యమని అణ్ణామలై క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందంటున్నారు. తమిళ జనం కమలం వైపు చూడటం లేదని స్పష్టమయ్యాక, అక్కడే ఉండి తన పొలిటికల్ కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకోవడం కంటే, ద్రవిడ ముద్ర లేని ఒక సరికొత్త ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. ఇప్పటివరకు దక్షిణాది రాజకీయాల్లో అణ్ణామలైని చూపిస్తూ ఓట్లు రాబట్టాలని చూసిన బీజేపీకి ఇది కోలుకోలేని దెబ్బేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అణ్ణామలై లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత దూరం కావడం వల్ల తమిళనాట బీజేపీ ఉనికి సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/annamalai-goodbye-to-bjp-39-221426.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.