అన్నా లెజినోవా తల నీలాల సమర్పణ
Publish Date:Apr 14, 2025

Advertisement
క్రిష్టియన్ అయినా డిక్లరేషన్ తో పాటు తలనీలాల సమర్పణ
హిందువుల గుండెల్ని దొచుకున్న పవన్ సతీమణి
ఆంధ్రులు ఫిదా.. ఫిదా..
శ్రీవారి లడ్డూను తిన్నా కూడా వారు ఆయన భక్తులు అయిపోతారన్న నానుడి ఉంది. అలాంటిది ఆయనకు మొక్కు కోవడం మాత్రమే కాదు తలనీలాలు సమర్పించడం అంటే వారు స్వామివారి పట్ల భక్తి చూపడంలోనే అది పరాకాష్ట. అలాంటి భక్తి చూపడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ప్రస్తుతం వార్తలకెక్కారు. అన్నాది ఈ మతం కాదు, ఈ నేల కాదు. కానీ ఇక్కడి భక్తి విశ్వాసాల పట్ల ఆమె అపారమైన నమ్మకం పెంచుకున్నట్టుగానే చెప్పాలి.
లేకుంటే తన కొడుక్కి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరగటమేంటి? ఆమె ఈ ప్రమాదంలోంచి తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ త్వరలోనే కోలుకోవాలని.. భావించడమేంటి? ఇప్పుడా మొక్కు తాను క్రిష్టియన్ అయి ఉండి కూడా డిక్లెరేష్ ఇచ్చి మరీ తీర్చుకోవడమేంటి? అన్నదిక్కడ చర్చనీయాంశంగా మారింది.
నిజానికి మార్క్ శంకర్ పవనోవిచ్ కి అంత పెద్ద ప్రమాదం ఏం జరగలేదు కానీ, బాలుడితో పాటు ప్రమాదంలో చిక్కిన ఒక బాలిక మాత్రం ప్రాణాలు కోల్పోయింది. దీంతో భయపడ్డ అన్నా లెజినోవా తన బంగారు కొండకు ఏమీ కాకూడదంటూ అచ్చం తెలుగువారిలా.. తెలుగువారి ఆధ్యాత్మిక అదృష్టం- వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి, స్వామీ నా కొడుకు ఈ ప్రమాదం నుంచి బయట పడితే, నీకు తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకోవడం మాత్రమే కాక.. డిక్లరేషన్ సైతం ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. నువ్వు నీ తలనీలాలను ఇవ్వడం కాదమ్మా.. మా మనసులను కూడా దోచుకున్నావంటూ ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఆమె పుట్టుకతో క్రిష్టియన్ అయినా, పవన్ కళ్యాణ్ సతీమణిగా ఇక్కడి సనాతన ధర్మంపై విపరీతమైన ప్రేమాభిమానాలను పెంచుకున్నారు. ఇక్కడి భక్తి విశ్వాసాలను అవగతం చేసుకున్నారు. వాటిని అర్ధం చేసుకోవడం మాత్రమే కాకుండా.. ఇదిగో ఇలా ఫాలో అవుతున్నారు కూడా. దీంతో ఇటు అభిమానులే కాదు అటు సామాన్య భక్త జనులు సైతం.. అన్నా లెజినోవాను తెగ మెచ్చుకుంటున్నారు.
కారణం.. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా జన్మతః క్రిష్టియనే. కానీ, శ్రీవారి దర్శనానికి వచ్చినపుడు కావాలనే డిక్లరేసన్ పై సంతకం చేయకుండా తెలుగువారిని తీవ్రంగా వేధిస్తుంటారు. పెద్ద పెద్ద ప్రముఖులే శ్రీవారి చెంతకు వచ్చినపుడు తాము హిందూయేతరులైనపుడు.. విధిగా డిక్లరేషన్ ఇస్తారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, తాను కూడా ఒక ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ మాత్రం .. అన్నా లెజినోవా అనే విదేశీయురాలికున్న కనీస విచక్షణా జ్ఞానం కూడా లేదన్న మాట వినిపిస్తోంది.
ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి అన్నట్టు ఇటు శ్రీవారి బ్రహ్మోత్సవాలపుడు కానీ, అటు ఒంటిమిట్ట కోదండ రామ స్వామి కళ్యాణోత్సవం లో కానీ, దుర్గమ్మ సన్నిధికి వచ్చినపుడు కానీ.. తన సతీమణితో సహా హాజరు కాని జగన్ రెడ్డి,, చేసిన సంప్రదాయ విరుద్ధమైన చర్యలు లెక్కలేనన్ని.
ఈ మాట వచ్చిందని చెప్పి.. 2024 ఎన్నికలకు ముందు సంక్రాంతి సందర్భంగా.. ఇంటి ముందు శ్రీవారి సెట్టు వేయించుకుని.. ఆయన్ను అవమానించడం మాత్రమే కాకుండా.. తాము తయారు చేయించిన ప్రసాదాన్ని కూడా తీసుకోకుండా దాన్ని నాప్ కిన్ కి తుడిచేసుకుని జగన్ చేసిన దైవాపరాధం అందరికి తెలిసిందే.
అలాంటిది అన్నా లెజినోవా.. మన సంస్కృతీ సంప్రదాయాలను ఇంత చక్కగా పాటిస్తుంటే అందరికీ ముచ్చటేస్తోంది. జగన్ లా ఆమె సైతం ఒక క్రిష్టియనే అయినా.. భారతీయతను మరీ ముఖ్యంగా మన తెలుగు వారి సంప్రదాయాలను.. పదహారాణాల తెలుగింటి ఆడపడుచులాగా పాటించడంతో.. ఆమెపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అలాగని అన్నా లెజినోవా కేవలం పైపై సంప్రదాయాల పాటింపు మాత్రమే కాదు.. జాతకాలను చూపించుకోవడం వంటి ఎన్నో సంప్రదాయబద్ధమైన పనులు చేయిస్తారనీ అంటారు. మార్క్ శంకర్ పవనోవిచ్ అంటూ తన కొడుక్కి హిందూ శబ్ధంతో కూడిన నామకరణం చేయించడం మాత్రమే కాదు.. అతడు తండ్రికి మించిన తనయుడు అవుతాడని కూడా జాతకం కూడా చెప్పించుకున్నట్టు చెబుతున్నారు. ఈ దిశగా పవనోవిచ్ కి సంబంధించిన జాతక ఫలితం ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఏది ఏమైనా అన్నా లెజినోవా కొట్టించుకున్న ఈ గుండు ద్వారా ఇటు తెలుగు వారి గుండెల్ని దోచుకోవడం మాత్రమే కాకుండా.. అటు మాజీ సీఎం జగన్ కి చెంపపెట్టులా ఆమె డిక్లెరేషన్ మీద సంతకం పెట్టి మరీ తలనీనాలు సమర్పించుకోవడంతో శ్రీవారి భక్తులు తబ్బి ఉబ్బిబ్బి అయిపోతున్నారట. ఎందుకంటే శ్రీవారికి తలనీలాల సమర్పణ అంటే ఎంతో ఇష్టం. అలాంటి ఇష్టమైన కార్యక్రమాన్ని తాను క్రిష్టియన్ అయినా కూడా.. తెలుగు వారి నమ్మకాలను విశ్వాసాలను పాటించడంతో ఇక్కడి వారిని మరింతగా ఆకట్టుకున్నారామె.
http://www.teluguone.com/news/content/anna-leginova-wins-the-hearts-of-hindus-25-196199.html












