యూపీలో అరాచకత్వం పరాకాష్టకు చేరిందా?

Publish Date:Apr 17, 2023

Advertisement

ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల పరిరక్షణ పేరిట యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రాతియుగంలోకి రాష్ట్రాన్ని తీసుకు వెళుతోందా? ప్రభుత్వం మాఫియా, గూండాయిజం, రౌడీయిజం అణచివేత పేరిట సర్కార్ హింసకు తెరలేపిందా? అంటే రాజకీయ ప్రత్యర్థులు, పరిశీలకులు, చివరకు సామాన్య జనం సైతం ఔననే అంటున్నారు. 

ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత ఇంత వరకూ 178 మంది క్రిమినల్స్ ఎన్ కౌంటర్లో హతమయ్యారు. అంటే దాదాపుగా ప్రతి 13 రోజులకూ ఒక ఎన్ కౌంటర్ జరిగిందన్న మాట. 2022 ఎన్నికలలో యోగి సర్కార్ మరో సారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆ ప్రభుత్వం మాఫియాపై ఉక్కుపాదం మోపడమూ ఒక కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. అయితే రాజ్యహింస భయంతోనే యోగి సర్కార్ అధికారాన్ని నిలబెట్టుకుందన్న రాజకీయ విమర్శలూ ఉన్నాయి. నేరస్థుడిని చట్టం ముందు నిలబెట్టి చట్ట ప్రకారం శిక్షపడేలా చేయాలి. ఇది రాజ్యాంగం చెబుతున్న మాట. అయితే యూపీలోని యోగి సర్కార్ మాత్రం తానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలా చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదన్నది విపక్షాల విమర్శ.

ఇప్పుడు ఒక్క సారి జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోడీ సర్కార్ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తుందనీ, అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు ముడుపులు, అవినీతి వంటి వాటిని ప్రోత్సహించడానికి కూడా వెనుకాడదనీ కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడు మళ్లీ యూపీలో గ్యాంగ్ స్టర్ ల ఏరివేత పేర రాజకీయ లబ్ధి కోసం యోగి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు.. కేంద్రంలోని మోడీ సర్కార్ తీరు దాదాపు ఒకేటే అనేలా  జరుగుతున్న పరిణామాలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మళ్లీ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాల వద్దకు వస్తే.. తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో మోడీకి అస్మదీయుులగా పేరుపడ్డ వారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపితే తనకు మూడు వందల కోట్లు ముడుపులు అందుతాయని ఆఫర్ వచ్చిందన్నారు. అలాగే పుల్వామా ఘటన విషయంలో మోడీ సర్కార్ ఎంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందో.. తీరా ఆ ఘటన జరిగిన తరువాత దానిని తన రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకుందో సవివరంగా చెప్పారు.

పాకిస్థాన్ నుంచి ఆర్డీఎక్స్ తో వచ్చిన ట్రక్కు దాదాపు పక్షం రోజులు జమ్మూ కాశ్మీర్ రోడ్ల మీద యథేచ్ఛగా తిరిగినా గుర్తించలేని ఘోర నిఘా వెఫల్యాన్ని ఎండగట్టారు. అలాగే ఘటన జరిగిన తరువాత తనను నోరెత్తదంటూ స్వయంగా మోడీ ఫోన్ చేశారనీ, ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారు కూడా అదే విధంగా ఫోన్ చేశారనీ వెల్లడించారు.  ఏ మాత్రం భద్రత లేని విధంగా సీఆర్పీఎఫ్ దళాలను రోడ్డు మార్గంలో పంపడం సరైనది కాదనీ, వారిని ఎయిర్ లిఫ్ట్  చేయాలన్న తన సూచనను మోడీ సర్కార్ పట్టించుకోలేదనీ సత్యపాల్ మాలిక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. 

ఇప్పుడు మళ్లీ యూపీ విషయానికి వస్తే..  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్‌ హత్య ఘటన తర్వాత హంతకులను ఉద్దేశించి సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అంతమొందిస్తామని  అసెంబ్లీ వేదికగా గట్టి హెచ్చరిక చేశారు. న్యాయవాది  బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి, ఉమేష్ పాల్ ను ప్రయాగ రాజ్ లో హత్య చేసిన హంతకులను మట్టిలో కలిపేస్తా ( మిట్టీ మే మిలాదేంగా) అని  హెచ్చరించారు.  ఆయన అన్నట్లుగానే  లోక్ సభ మాజీ ఎంపీ,   గ్యాంగ్ స్టర్ అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ ను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ లో హత మార్చారు. ఈ సంఘటన ఒక్క యూపీలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అది ఇంకా జనం మదిలో తాజాగా ఉండగానే.. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులైన మరో ఇద్దరు.. అసద్‌ తండ్రి అతీక్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ లు దారుణ హత్య కు గురయ్యారు.  

ఉమేశ్ పాల్‌ హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న అతీక్ అహ్మద్ ను మెడికల్‌ చెకప్‌ కోసం ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి పోలీసులు జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ సందర్భంగా పోలీసు వలయంలో ఉన్న అతీక్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ లు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు దూసుకు వచ్చి పాయింట్ బ్లాంక్ లో తుపాకితో కాల్పులు జరిపి హత మార్చారు. ఈ ఘటనపై యోగి సర్కార్ ఒక విచారణ కమిటీ వేసింది. అది వేరే సంగతి. కానీ ప్రయాగ్ రాజ్ లో ఈ సంఘటన జరిగిన తరవాత అంతటా యోగి చెప్పింది చేశారన్న మాటే వినిపిస్తోంది.  

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.