ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన వివాహిత.. ఎందుకంటే..!
Publish Date:Aug 2, 2026
Advertisement
ఓ వైపు వివాహేతర సంబంధం.. మరోవైపు కుమార్తె విషయంలో రగిలిన తల్లి ఆగ్రహం.. చివరకు ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సునీతకు సురేష్ అనే యువకుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఒకవైపు తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరోవైపు సునీత కూతురుతో అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. అయితే సురేష్ తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సునీతకు తెలియడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కూతురి విషయంలో సురేష్ తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత... పథకం ప్రకారం తన ప్రేమతో అతన్ని కౌగిల్లో బంధించి కాళ్లు, చేతులు కట్టేసి పదునైన ఆయుధంతో దాడి చేసి మర్మాంగాన్ని కోసి వేసింది. ఈ దాడిలో సురేష్ తీవ్రంగా గాయపడ్డా డు.ఘటన విషయం బయటకు రావడంతో డ్రైవర్స్ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది. తీవ్ర గాయాలతో ఉన్న సురేష్‌ను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటి? సురేష్ సునీత కుమార్తెతో ఎలా ప్రవర్తించాడు? దాడి ఏ పరిస్థితుల్లో జరిగింది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సునీత, సురేష్ మధ్య ఉన్న సంబంధం, ఘటనకు ముందు జరిగిన పరిణా మాలపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. కేసు నమోదు, నిందితురాలిపై తీసుకునే చర్యలు తదితర అంశాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. Anantapur dist, Drivers Colony, Suresh, Sunita, AP Police, Crime news
http://www.teluguone.com/news/content/anantapur-dist-36-227788.html





