అమ్మఒడికి మంగళం.. అంచెల వారీగా తూట్లు

Publish Date:Jun 28, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నిటిలోకి, ‘అమ్మఒడి’ అత్యంత ప్రతిష్టాత్మక పథకం...అలాగని ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటోంది. న భూతో న భవిష్యతి, ఇలాటింటి పథకం ఇంతవరకు లేదు ఇక ముందు ఉండదు, అని వైసీపీ సర్కార్ ఫుల్ పేజీ ప్రకటనలతో ... ప్రచారం సాగించింది. అయితే, ఇప్పడు, అదే  అమ్మఒడి పథకాన్ని,  గుదిబండ పథకంగా భావిస్తోందా ? ఎదో ఒక సాగుతో, ‘అమ్మఒడి’ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందా? అంటే, ప్రభుత్వ వర్గాల నుంచే అవుననే సమాధానం వస్తోంది.  నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా అభివృద్ధిని పక్కన పెట్టి, అప్పులు చేసిమరీ,సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. సంక్షేమ పథకాలే తమను  మళ్ళీ మళ్ళీ అందలం ఎక్కిస్తాయనే భ్రమల్లో వైసీపే నేతలు తెలిపోతుంటారు. సంస్ఖేం లెక్కలు ఆ పార్టీ నాయకులు గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యమంత్రి అయితే, మీటలే మన ఓట్లు... వచ్చే ఎన్నికలలో 175 సెట్లు మనవే అనే ధీమా వ్యక్త చేసారు. 
అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అదుపు తప్పిన అవినీతి కారణంగా మూడేళ్ళు గడించే సరికి సర్కార్ ఖజానా ఖాళీ అయింది.  

దీంతో, ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని, ఒక్కొక్క సాకుతో నీరు గార్చే పనిలో పడింది. చివరకు, దుల్హన్ వంటి కొన్ని పథకాలకు ఔర్తిగానే మంగళ పాడేశారు. అందులో భాగంగా అమ్మఒడి పథకాన్ని అంచల వారీగా అటకెక్కించడం ఖాయని, ప్రభుత్వ అధికారులే అనుమనాలు వ్యక్తపరుస్తున్నాఋ. కొవిడ్ సాకుగా చూపి  ఒక సంవత్సరం,  పథకాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత, 75 శాతం హాజరు నిబంధన పేరుతో ‘అమ్మ ఒడి’ నిధులను 50 వేల మందికి ఎగ్గొట్టారు. 

ఇక ఇప్పడు అమ్మఒడిలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. బహిరంగ మార్కెట్‌లో ల్యాప్‌టాప్‌ ధరలు పెరిగాయని పంపిణీ నిలిపివేస్తున్నామని చావు కబురు చల్లగా చెప్పింది. నిజానికి, ఒక విధంగా పిల్లలకు ల్యాప్‌టాప్‌’లు ఇవ్వడం వలన, కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే, ప్రభుత్వం ఆర్థిక భారానికి వెరసి వెనకడుగు వేసింది.

నిజానికి ఒక్క అమ్మఒడి పథకమే కాదు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సంక్షేమా పథకాలు ప్రకటించడంలో ఎంత దూకుడు చూపారో, ఇప్పడు ఒక్కొక్క పథకానికి కోతలు పెట్టడంలోనూ, అంతకంటే ఎక్కువ దూకుడు చూపుతున్నారు.

ఒంటరి మహిళలకు పింఛను ఇచ్చే వయసును 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించారు. ఇలా మొత్తానికి జగన్ రెడ్డి ప్రభుత్వం, మూడేళ్ళలో  రాష్ట్రాన్ని, ఓ వంక అప్పుల ఉబిలో చేర్చింది. మరి వంక సక్షేమ పథకాలకు చెల్లు చీటీ ఇచ్చింది. అందుకే, ప్రజలు ఒక్క ఛాన్స్ సీఎంను ఎంత త్వరగా సగానంపుదామా అని, ఎదురు చూస్తున్నారు.

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.