అంబటి వైసీపీని అడ్డంగా బుక్ చేసేశారుగా?

Publish Date:Jun 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుది  ఒక ప్రత్యేక శైలి.  ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని అయన చేసే విమర్శలు తరచుగా బూమరాంగ్ అవుతూ ఉంటాయి.   తాజాగా    అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు  తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అధికారంలో ఉన్నప్పటి కంటే.. అధికారంలో నేని సమయంలోనే అప్రమత్తంగా ఉండాలంటారు పరిశీలకులు.  అధికార పక్షంపై చేసే విమర్శలకు   ఆధారాలు చూపించాల్సిన బాధ్యతను విస్మరించి నిరాధార ఆరోపనలు చేస్తే.. ప్రజలలో ప్రతిష్ట మసకబారడమే కాకుండా,  సొంత పార్టీకే  నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అంబటి రాంబాబే చెప్పారు. వైసీపీ తప్పు చేసిందని ఆయన స్వయంగా ప్రకటించేశారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫేక్ ఫోటో తీవ్ర వివాదానికి కారణమైంది. సాయి కృష్ణ, నవీన్ రెడ్డి అనే వ్యక్తులకు సంబంధించిన ఒక ఫోటోను ఆధారం చేసుకుని, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే..  ఆ ఫోటో పూర్తిగా మార్ఫింగ్ చేసిన నకిలీ ఫోటో అని తేలడంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఫేక్ ఫోటో వ్యవహారంపై స్పందించిన అంబటి రాంబాబు.. తమ పార్టీ చేసిన పెద్ద తప్పును బహిరంగంగానే అంగీకరించేశారు.  ఎలాంటి ప్రాథమిక  నిర్ధారణ లేకుండా..  కేవలం సోషల్ మీడియాలో కనిపించిన ఒక ఫేక్ ఫోటోను నమ్మి కూటమి ప్రభుత్వంపై దాడికి దిగడం వల్లే వైసీపీ   బుక్కయిందని అంబటి అన్నారు.    నిజం కాని విషయాలపై స్పందించి నవ్వులపాలు కావడం కంటే, మౌనంగా ఉండటమే మేలన్నట్లుగా ఆయన మాట్లాడారు. 

విషయమేంటంటే.. ఆంధ్రప్రదేశ్ లో   సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే..  వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు,  మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన  నోటికి పని చెప్పారు.అక్కడితో ఆగకుండా సాయి కృష్ణ ఫోటోను ప్రదర్శించి.. పోలీసులు దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడని  ఆరోపణలు చేశారు.

అంబటి రాంబాబు ప్రదర్శించిన ఫొటోలను ఆధారం చేసుకుని జగన్ సొంత మీడియా కూడా రెచ్చిపోయి వార్తలను ప్రచురించింది. ప్రసారం చేసింది.  అయితే అంబటి రాంబాబు చూపిన ఫొటో సాయికృష్ణది కాదు, నవీన్ రెడ్డిదని తేలింది.  ఈ విషయాన్ని స్వయానా నవీన్ రెడ్డి మేనమామ  శీను రెడ్డి బయటపెట్టారు. దీంతో కథ అడ్డం తిరిగింది. ఈ నవీన్ రెడ్డి ఎవరన్న ఆరా మొదలైంది. ఆ ఆరాలో  నవీన్ రెడ్డి, సాయి కృష్ణ దేవినేని అవినాష్ కు ప్రధాన అనుచరులని తేలింది.  వీరిద్దరూ మాదక ద్రవ్యాలు తీసుకొని దారుణంగా ప్రవర్తించే వారిని  విజయవాడ వాసులు ఆరోపిస్తున్నారు.   వైసీపీ హయాంలో   వీరిద్దరూ డ్రగ్స్ తీసుకుని ఇష్టానుసారం ప్రవర్తించేవారనీ రాణి తోట.. కృష్ణలంక వాసులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు తాను అడ్డంగా బుక్కవ్వడమే కాకుండా, వైసీపీని కూడా బుక్ చేసేశారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. 

By
en-us Political News

  
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.
తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.