అమరావతికి ఐకానిక్ గేట్ వే.. ఆరు లేన్ల ఎలివేటెడ్ బ్రిడ్జి.!

Publish Date:Aug 8, 2026

Advertisement

 రాజధాని అమరావతి,   విజయవాడ నగరాల మధ్య ఇంజినీరింగ్ అద్భుతం ఆవిష్కృతమౌతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నిత్యం నరకయాతన చూపిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారంగా.. కృష్ణా నదిపై  సిగ్నేచర్ బ్రిడ్జి  నిర్మాణానికి తొలి అడుగు పడింది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్)  ఈ ఐకానిక్ సిగ్నేచర్ బ్రిడ్జికి  సంబంధించిన ఫీజిబిలిటీ, డీపీఆర్ (డీపీఆర్),  కన్సల్టెన్సీ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. 

 ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను, మచిలీపట్నం, హైదరాబాద్ జాతీయ రహదారిని నుసంధానిస్తూ ఈ ఐకానిక్ బ్రిడ్జి  బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. 1.10 కిలోమీటర్ల పొడవునా ఎలివేటెడ్ విధానంలో 6 లేన్ రోడ్డుతో   దీనిని తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికుల సురక్షిత రాకపోకలతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లను కూడా నిర్మించనున్నారు. ఈపీసీ ( పద్ధతిలో చేపట్టే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం, కాన్సెప్ట్ డిజైన్లు  ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ 3 నెలల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది. 

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే ఈ వంతెన రాజధానికి  గేట్‌వే గా  నిలవనుంది. వంతెన నిర్మాణానికి  ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు  వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయనున్నారు.  నిత్యం లక్షలాది వాహనాలతో కిటకిటలాడే ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ ఒత్తిడిని ఈ నూతన వంతెన గణనీయంగా తగ్గిస్తుంది. ఎన్‌హెచ్-65తో నేరుగా అనుసంధానం కావడం వల్ల జిల్లాల మధ్య సరుకు రవాణా వేగవంతమై  పారిశ్రామిక ప్రగతి, ఆర్థిక వ్యవస్థ పరుగతి మరింత వేగం పుంజుకోవడానికి కూడా ఈ ఐకానిక్ బ్రిడ్జి దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Amaravati Gate way, infrastructure  Bridge, 6lane, National Highway, Krishna River Bridge Vijayawada, AP Infrastructure Tenders,  

By
en-us Political News

  
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.