అల్లు అర్జున్ కు తత్వం బోధపడినట్లేనా?

Publish Date:Dec 25, 2024

Advertisement

అల్లు అర్జున్  తన సినీమాలు వరుస విజయాలు అందుకుంటుండటంతో ఆయన యాటిట్యూడ్ మారిందన్న విమర్శలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో  అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం మాత్రం పెను వివాదానికి దారి తీసింది. అప్పటి వరకూ కలిసిమెలిసి ఉన్న అల్లు, మెగా కుటుంబాల మధ్య వివాదాలకు, విభేదాలకు అది కారణమైందన్న వాదనా ఉంది. మొత్తం మీద అల్లు అర్జున్ నంద్యాల ప్రచారం తరువాత నుంచి   అల్లు, మెగా అభిమానుల మధ్య  వైరం ప్రస్ఫుటంగా తెరమీదకు వచ్చింది. మెగా అభిమానులు అల్లు అర్జున్ కు దూరం అయ్యారు. ఆ ప్రచారం పుష్ప2పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయి. సినిమాపై ప్రభావం సంగతి పక్కన పెడితే ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేసిన నాటి నుంచి అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. 

 ఇక అప్పుడు పుష్ప2 బెనిఫిట్ షో లేదా ప్రీమియర్ షో  సందర్భంగా  సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట సంఘటనను  వైసీపీ తనకు అంది వచ్చిన అవకాశంగా భావించి అల్లు అర్జున్ కు బాసటగా నిలిచింది. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు.  అల్లు అర్జున్ కు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.  దీనిని ఆంధ్రప్రదేశ్ లో మెగా ఫ్యామిలీ పరపతిని తగ్గించేందుకు, అలాగే కాపు ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి తనకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ నానా ప్రయత్నాలూ చేసింది. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ అనుకూల, సొంత మీడియా కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా కథనాలు వండి వార్చింది. అల్లు అర్జున్ అరెస్టు వెనుక మెగా రాజకీయం ఉందన్న భావాన్ని ప్రజలలో నటేందుకు ప్రయత్నాలు చేసింది. 

మరో వైపు తెలంగాణలో అధికారానికి దూరమై అసహనంతో ఉన్న బీఆర్ఎస్ కూడా అల్లు అర్జున్ అరెస్టు అంశాన్ని తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అంశంగానే భావించి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఆరోపణలనే గుప్పించింది. బీఆర్ఎస్ ట్రాప్ లో అల్లు అర్జున్ పడ్డారా అన్న అనుమానం కలిగే విధంగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ లో సంధ్యా ధియోటర్ తొక్కిసలాటకు కారణం జనాలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణం అన్నట్లుగా మాట్లాడారు. అయితే పోలీసులు అల్లు అర్జున్ రోడ్ షో వీడియోలను విడుదల చేయడంతో ఆయన నేల మీదకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. పోలీసుల విచారణలో ఆయన తన తప్పు ఒప్పుకున్నారనీ, సారీ చెప్పారనీ వార్తలు వినవస్తున్నాయి. అదంతా పక్కన పెడితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ అత్యుత్సాహం ఆ పార్టీని ప్రజలలో మరింత పలుచన చేసింది. 

ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టై విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడిన  ఏ సందర్భంలోనూ ఆయన జగన్ ప్రస్తావన కానీ, వైసీపీ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. అంతే కాకుండా అల్లు అర్జున్ స్వయంగా  చిరంజీవి నివాసానికి, నాగబాబు ఇంటికి వెళ్లి మరీ తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ణతలు తెలిపి వచ్చారు. దీనిని బట్టే తన నంద్యాల ప్రచారం తొందరపాటేనని అల్లు అర్జున్ పరోక్షంగా అంగీకరించినట్లైంది.  అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీతో మరింత కలివిడిగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. దీంతో జగన్ పార్టీ అత్యుత్సాహం మీద అల్లు అర్జున్ నీళ్లు చల్లినట్లైంది.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.