బీజేపీతో పొత్తు టీడీపీకి అవసరమా? అనర్ధమా?

Publish Date:Sep 1, 2022

Advertisement

అన్నీ అనుకున్నట్లే జరిగితే, అతి త్వరలోనే, టీడీపీ, బీజేపీల మధ్య మళ్ళీ పొత్తు పొడిచే అవకాశాలున్నాయనే సంకేతాలు రోజు రోజుకు మరింతగా స్పష్టమవుతున్నాయి. బీజేపీ ఏపీ రాష్ట్ర నాయకులు, అబ్బే అలాంటిదేమీ లేదని బుకాయించినా, కేంద్ర నాయకత్వం మాత్రం టీడీపీతో పొత్తు విషయంపై సీరియస్ గానే ఆలోచిస్తోంది. ఇంకా స్పష్టంగా పొత్తు వైపే మొగ్గు చూపుతోందని, ఢిల్లీ మీడియా వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తోంది. మరో వంక, వరస పెట్టి మిత్ర పక్షాలు అన్నీ, ఎన్డీఏని వదిలి పోవడంతో పాత మిత్రులతో కొత్త పొత్తులకు సంబంధించి పునరాలోచించక తప్పని పరిస్థితి బీజేపీకి ఏర్పడిందని, ముఖ్యంగా నితీష్ కుమార్ గుడ్ బై  చెప్పిన తర్వాత  పార్టీ వ్యూహకర్తలు  ఆ దిశగా ఆలోచనలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 

అదొకటి అలా ఉంటే, ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ఉన్నది లేదు,పోయేది లేదు. టీడీపీతో పొత్తు వలన వస్తే అసెంబ్లీలో ఓ నాలుగు, లోక్ సభలో ఒకటో రెండో  సీట్లు వస్తే వస్తాయి. వచ్చే విషయం పక్కన పెడితే, పోయేది అయితే అసలే లేదు. అయితే, పొరుగు రాష్ట్రం తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడమే కాకుండా, ఇంకొక్క మెట్టెక్కితే,సునాయాసంగా అధికారంలోకి రాగలమని,బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటుగా, తెలంగాణ బీజేపీలోనూ గట్టి విశ్వాసం ఏర్పడింది.  ఇదే విషయంపై బీజేపే సీనియర్ నాయకుడు ఒకరు, బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో బాగా ప్రచారం అయిన స్లోగన్   ‘ఔర్ ఏక్ ధక్కా, మారో ని గుర్తు చేస్తూ ఇంకొక్క దెబ్బ పడితే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టగలమని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం గట్టిగా నమ్ముతోందని అన్నారు.  

మరో వంక,తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, జాతీయ రాజకీయాలపై కన్నేసి, కమల దళానికి సవాలు విసురుతున్నారు. నిజానికి ఇప్పటికిప్పుడు, కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీకి సవాలు కాకపోవచ్చును, కానీ, లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ముచ్చటగా మూడవసారి విజయం సాధించి, అయన ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సొంతం చేసుకుంటే మాత్రం ఆయన ప్రభావం జాతీయ రాజకీయాల పై, ఉంటుందని బీజేపీ వ్యూహ కర్తలు లెక్కలు వేస్తున్నారు. సో .. కేసీఆర్ జాతీయ ఆశలను మొగ్గలోనే తుంచేయాలాంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసని ఓడించడం కమల దళానికి అవసరమని, ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

అదలా  ఉంటే, తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పూర్వ వైభవం కోల్పోయినా, ప్రజల్లో ముఖ్యంగా బీసీల్లో ఆ పార్టీకి ఇంకా పట్టుంది. రాష్ట్ర విభజనకు నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 15 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే 2018 ఎన్నికలలో కాంగ్రెస్, కోదండ రామ్ పార్టీలతో కలిసి ప్రజా ఫ్రంట్’గా ఏర్పడి పోటీ చేసినా, పెద్దగా ఫలితం దక్కలేదు. కేవలం మూడు శాతం ఓట్లు, రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఇద్దరు కూడా కారెక్కడంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. మరో వంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సహా అనేక మంది నాయకులూ తెరాస, బీజేపే, కాంగ్రెస్ పార్టీలలో చేరిపోయారు. ప్రస్తుత తెరాస మంత్రివర్గంలో అరడజను మందికి పైగా మాజీ టీడీపీ నేతలే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రస్ ఎమ్మెల్యే సీతక్క సహా చాలా మంది కాంగ్రెస్ నాయకులు  మాజీ టీడీపీ నేతలే.. ఇందులో రేవంత్ రెడ్డి సహా చాలా మంది  చంద్రబాబును గౌరవించే.. అభిమానించే వారే ఉన్నారు. 

అదెలా ఉన్నప్పటికీ, తెలంగాణలో ఇంచుమించుగా 32 అసెంబ్లీ నియోజక వర్గాల్లో , ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఆంధ్రా సెటిటర్స్ గెలుపు ఓటములను నిర్ధారించే నిర్ణాయక శక్తిగా ఉన్నారు. సహజంగా సెట్ల్లెర్స్  పై టీడీపీ ప్రభావం ఉంటుందని. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు ఇప్పటికీ టీడీపీ వైపు మొగ్గుచుపుతున్నారని, బీజేపీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో కీలక పదవులు అందుకున్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే. లక్ష్మణ్ వంటి  కొందరు బీసీ నేతలు టీడీపీతో పొత్తు  తెలంగాణలో బీజేపీకి కలిసొస్తుందని విశ్లేషిస్తున్నారు. 

అందుకే బీజేపీ జాతీయ నాయకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశంతో పొత్తును కోరుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  ముఖ్యంగా తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీడీపీతో పొత్తును గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, గత ఎన్నికలలో కేసీఆర్,  చంద్రబాబు భుజం మీద సెంటిమెంట్ తుపాకి పెట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన విధంగా రేపటి ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీస్తారని ఈ వర్గం వాదిస్తోంది. అయితే, ఉభయ వర్గాలు కూడా అంతిమ నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి వదిలేసినట్లు చెపుతున్నారు. అలాగే, బీజేపీ జాతీయ నాయకత్వం అంత త్వరగా నిర్ణయం తీసుకోదని, టీడీపీతో పొత్తును బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ ప్రయోజనాల కోణంలోనే చూస్తుందని అంటున్నారు. తెలంగాణలో బీజేపీకి  మేలు జరుగుతుందంటే, ఏపీలో పార్టీ లాభనష్టాలను పక్కన పెట్టి,    ఉభయ తెలుగు రాష్ట్రాలలో టీడీపీతో పొత్తుకు టిక్కు పెడుతుందని అంటున్నారు. 

అదలా ఉంటే, టీడీపీ, బీజేపీ పొత్తు వలన ఏపీలో టీడీపీకి ఏ మేరకు మేలు జరుగుతుందనే  విషయంలో, ఇటు పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీకి గత ఎన్నికల్లో నిండా ఒక శాతం ఓటు కూడా రాలేదు. ఇప్పుడైనా, రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది అనేందుకు ఎక్కడా దాఖాలాలు లేవు. తిరుపతి లోక సభ, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, టీడీపీ పోటీలో లేకున్నా, బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్ దక్కలేదు. అయినా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, అలాగే,  ఓ ఐదారు శాతం వరకు ఓటు షేర్ ఉంటుందని భావిస్తున్న జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండడం వలన చేత, టీడీపీ, నాయకత్వం బీజేపీతో పొత్తుకు సిద్ధమైందని అంటున్నారు. 

 ఈ రెండు కారణాల చేతనే, తెలుగు దేశం పార్టీ ఏపీలో బీజేపీతో పొత్తును కోరుకుంటోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో, బీజేపీతో పొత్తు వలన టీడీపీకి నష్టం జరిగే ప్రమాదం లేక పోలేదని కూడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గడచిన ఎనిమిది సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విభజన హమీలతో సహా, రాష్ట్రానికి మేలు చేసే ఏ ఒక్క మంచి పని చేసింది లేదని, సామాన్య ప్రజలకు కూడా అర్థమై పోయింది. అలాగే, గడచిన మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికృత మానస పుత్రిక మూడు రాజధానుల ప్రతిపాదన సహా, జగన్ రెడ్డి అరాచక పాలనకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందనే అభిప్రాయమే ఆందరిలోనూ వుంది. నిజానికి, 2019 కంటే ఇప్పుడే బీజేపీ పట్ల జనంలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని అంటున్నారు.

అప్పుడు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం ఇతరత్రా చేయవలసిన సహాయం చేయక పోవడం వలన, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పట్ల వ్యక్తమైన ప్రజాగ్రహానికి,ఇప్పడు జగన్ రెడ్డి అరాచక పాలను కేంద్ర ప్రభుతం గుడ్డిగా సంర్దిస్తోందనే ఆగ్రహం తోడైంది.ఒక  విధంగా ఏపీ ప్రజల్లో బీజేపీ పట్ల డబుల్ ఇంజిన్ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో, టీడీపీ, బీజేపీ పొత్తును సమాన్య   ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనే విషయంలో అనుమానాలున్నాయని అంటున్నారు.   ఈ అన్నిటినీ మించి గత 2019 ఎన్నికల్లో  బీజేపీ ఓటర్లు, టీడీపీ ఓటమే లక్ష్యంగా, సొంత పార్టీ అభ్యర్ధులు ఉన్నా, వైసీపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని మరిచి పోరాదని అంటున్నారు. ఇప్పడు కూడా పార్టీ జాతీయ నాయకత్వం బలవంతంగా టీడీపీతో పొత్తుకు ఒప్పించినా,  బీజేపీ ఓటు, అది ఎంతైనా కానీ, టీడీపీకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అవుతుందనే నమ్మకం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.

నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాగ్రహం, పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత కుమ్ములాటల నేపధ్యంలో, ప్రజలు టీడీపీవైపు చంద్రబాబు వైపే చూస్తున్నారు. ఈ  పరిస్థితిలో  బీజేపీతో పొత్తు అవసరమా? అనర్ధమా? అనే విషయంలో తెలుగు దేశం పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచించు కోవలసిన  అవసరం ఉందని అంటున్నారు.  నౌ ది బాల్ ఈజ్ ఇన్ టీడీపీ కోర్ట్ ... నిర్ణయం తీసుకోవలసింది, టీడీపీనే కానీ, రాష్ట్రంలో ‘జీరో’ పార్టీ బీజేపీ కాదని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

By
en-us Political News

  
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.