Publish Date:Jan 24, 2025
అలకనంద కిడ్నీ రాకెట్ కేసును సిఐడికిఅప్పగించే యోచనలో తెలంగాణ సర్కారు ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ లో పెద్ద తలకాయలు ఉన్నట్లు తెలుస్తోంది. సరూర్ నగర్ లో ఉన్న ఈ ఆస్పత్రిలో గత కొన్ని నెలలుగా కిడ్నీ రాకెట్ గుట్టు చప్పుడు కాకుండా నడుస్తోంది. . అలకనంద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుమంత్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ అలకనంద ఆస్పత్రిలో భాగస్వామి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం ఆరుగురు ఈ కిడ్నీ రాకెట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిని ఇప్పటికే సీజ్ చేశారు. ఒక్కో కిడ్నీ ఆపరేషన్ కోసం అలకనంద 50 నుంచి 55 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. కేవలం ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఈ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ నడిపించిదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. కిడ్నీ రాకెట్ నిర్వహించడానికే ఈ ఆస్పత్రి ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. తొమ్మిది పడకలతో ఏర్పాటైన ఈ ఆస్పత్రికి ఇద్దరు తమిళనాడుకు చెందిన గ్రహీతలు, ఇద్దరు కర్నాటక వాసులు డోనర్స్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిని ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఉస్మానియా మాజీ సూపరిండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని నియమించింది. కేసు దర్యాప్తులో డాక్టర్ నాగేందర్ కమిటీ ఇచ్చే నివేదిక దర్యాప్తులో కీలకం కానుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/alakananda-kidney-racket-case-to-cid-25-191778.html
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.