ఆసియాక‌ప్‌.. సూర్య ప్ర‌తాపంతో భార‌త్ ఘ‌న‌విజ‌యం

Publish Date:Sep 1, 2022

Advertisement

పాకిస్థాన్‌పై చివ‌రంటా ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్‌లో గెలిచిన భార‌త్ త‌న రెండో మ్యాచ్‌లో హాం కాంగ్‌పై సునాయాసంగా విజ‌యం  సాధించింది.  హాంకాంగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. టాస్ గెలిచినా హాంకాంగ్ బౌలింగ్ చేయ‌డానికి నిర్ణ‌యించుకుంది. మొద‌టి ఐదారు ఓవ‌ర్ల‌లో హాంకాంగ్ బౌల‌ర్లు  కొంత భార‌త్ స్టార్ ఓపెన‌ర్లు కెప్టెన్ శ‌ర్మ‌, రాహుల్‌ను క‌ట్ట‌డి చేసిన‌ట్టు క‌నిపించారు. క్ర‌మేపీ భార‌త్ బ్యాట‌ర్లు విజృంభించారు. ఫోర్లు సిక్స్‌ల‌తో బ్యాటింగ్ రుచి చూపించారు. దుర‌దృష్ట‌ వ‌శాత్తూ రోహిత్ శ‌ర్మ ఓ మంచి సిక్స్ కొట్ట‌బోయే ఫీల్డ‌ర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత కింగ్ కోహ్లీ వ‌స్తూనే కాస్తంత ధాటిగా ఆడు తూ సింగిల్స్‌, డ‌బుల్స్ మీద దృష్టిపెట్ట‌డంతో స్కోర్ వేగం పుంజుకుంది. రాహుల్ సిక్స్‌లు, ఫోర్ల‌తో త‌న పాత ఫామ్ మ‌ళ్లీ రుచి చూపించాడు. 

అత‌ని త‌ర్వాత వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్ మాత్రం కోహ్లీకి ధీటుగా వ‌స్తూనే ఫోర్లు, సిక్స్‌లూ బాది హాంకాంగ్ బౌల‌ర్లకు లైన్ మ‌ర్చిపోయేలా చేశాడు. భారీ సిక్స్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకు న్నాడు. ముఖ్యంగా 20వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లతో సూర్య కుమార్ యాదవ్ హాంకాంగ్ బౌలర్ అర్షద్‌పై విరుచుకు పడ్డాడు. ఆ జోరులోనే భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 20 ఓవ‌ర్ల‌లో 192 ప‌రుగులు చేసింది. సూర్య  26 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో బ్యాట్‌ను గట్టిగా ఝుళిపించి 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలి చాడు. కింగ్‌ కోహ్లీ కూడా 44 బంతుల్లో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలి చాడు. 

193 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి పాలైంది. బాబర్ హయత్ 41 పరుగులు, కించింత్ షా 30 పరు గులు, మెకెనీ 16 పరుగులు, జీషన్‌ అలీ 26 పరుగులు చేశారు.

టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, అవీష్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది. హాంకాంగ్ జట్టు కెప్టెన్ నిజాకత్‌ ఖాన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌ సూపర్‌-4కు చేరింది. దాదాపుగా భారత్‌, పాక్‌ జాతీయులతో నిండి ఉన్న హాంకాంగ్‌ జట్టు రోహిత్‌ సేనకు ఏవిధంగానూ పోటీ ఇవ్వలేకపోయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్స్ సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ 98 పరుగుల భాగస్వామ్యం టీమిండియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

By
en-us Political News

  
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.