సాయికృష్ణ మిస్సింగ్ కేసు: కుల రాజకీయాల కుంపటిగా మార్చడం దారుణం.. అడుసుమిల్లి

Publish Date:Jun 19, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసు చుట్టూ రోజుకో మలుపు తిరుగుతుండటంతో అసలు ఏం జరిగిందనే దానిపై సర్వత్రా మిస్టరీ నెలకొంది. అయితే, ఒక తల్లి కడుపుకోతగా మిగిలిన ఈ సున్నితమైన కేసును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కులాల కుంపటిగా మార్చడానికి ప్రయత్నించడం అత్యంత దారుణమని ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు.  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన 

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఉదంతంపై మాట్లాడారు. ప్రస్తుతం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని కొట్టి చంపేశారా? లేక అతడు పరారీలో ఉన్నాడా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే బాధ్యుడిగా భావిస్తున్న కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసింది.  న్యాయస్థానం పర్యవేక్షణలో ఉన్న ఈ కేసుపై రాజకీయ నాయకులు తొందరపడి తీర్పులు ఇవ్వడం సరికాదన్నఅడుసుమిల్లి..  సాయికృష్ణ తల్లి ఆవేదనను ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలన్నారు. తన బిడ్డ బతికున్నాడో లేదో తెలియక, కనీసం చనిపోయాడని తెలిస్తే ఒక ఏడుపు ఏడ్చి ఊరుకునే పరిస్థితి కూడా ఆ తల్లికి లేకుండా పోయిందని, బూడిదైనా ఇవ్వాలంటూ ఆమె రోదించడం ఎంతో దారుణమన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఉంది కాబట్టే, ఒక తల్లి తన బిడ్డ కోసం పోలీసులను, వ్యవస్థలను నిలదీసే స్వేచ్ఛ లభించిందని కూటమి ప్రభుత్వం తీసుకున్న  చర్యలను ఆయన అభినందించారు.

అయితే, ఈ కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ  నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై   తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22   క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, నోటి దురుసు, ఇతరులను కించపరిచేలా మాట్లాడటం వల్లే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని గుర్తుచేశారు. అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఉన్న వ్యక్తిగత ద్వేషంతో ఈ కేసును రాజకీయ పావుగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. నేరం చేసినవాడు ఏ కులమైనా చట్టం ముందు నేరస్థుడేనని, దానికి కులాన్ని, మతాన్ని అంటగట్టడం వల్ల కేసు తీవ్రత పక్కదారి పడుతుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఒకవేళ కస్టడీ మృతి అని తేలితే సదరు పోలీస్ అధికారికి కఠిన శిక్ష పడటం ఖాయమని పేర్కొన్నారు. విపక్షాలు శవ రాజకీయాలు ఆపాలని, ఆ తల్లికి నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఆమెకు లీగల్ సపోర్ట్ అందించాలే తప్ప ఇలాంటి కుల రాజకీయాల చిచ్చు పెట్టవద్దని అడుసుమిల్లి శ్రీనివాసరావు హితవు పలికారు.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.