Publish Date:Feb 27, 2012
నిద్రావస్థలో 'పశ్చిమ' ఏసిబి
తెలుగువన్. కామ్ ప్రత్యేక స్పెషల్ స్టోరీ
పశ్చిమగోదావరి: ఏసిబి వలలో భారీ అవినీతి చేప వంటి హెడ్ లైన్స్ మనం అనేక చూసిఉంటాం. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం ఇటువంటి శీర్షికలు పెద్ద పెద్ద బూతద్దాలు పెట్టి చూసినా కనిపించవు. ఎందుకంటే ఈ జిల్లాలో అవినీతి నిరోధకశాఖ నిద్రావస్థలో ఉంది. సిబ్బంది లేక తరచు మూసివేసే ఉంటుంది. ఒక డిఎస్సీ, ఇద్దరు సిఐలు, 30 మంది సిబ్బందితో కళ కళలాడాల్సిన పశ్చిమగోదావరి జిల్లా ఏసీబీ కార్యాలయం ఇప్పుడు వెల వెలబోతోంది. ప్రస్తుతం ఒక హెడ్ కానిస్టేబుల్, ఆరుగురు కానిస్టేబుళ్ళు మాత్రం ఇక్కడ మిగిలారు.
మద్యం సిండికేట్లు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల గుట్టును రట్టు చేయాల్సిన ఏసీబీ అధికారులు చివరకు తమగుట్టును బైతపెట్టుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విజయవాడలోని ఏసీబీ సిఐ ఒకరిని ఇక్కడ డిఎస్పీగా పనిచేసిన నర్సింహమూర్తి ఏడునెలల క్రితం వేరే చోటుకు బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి ఇక్కడకు మరో డిఎస్సీ రాలేదు. ఇద్దరు సిఐలతోనే చాలాకాలం బండి నడిపించారు. మద్యం సిండికేట్లపై దాడులు జరగడానికి ముందు ఇద్దరు సిఐల్లో ఒకరైన లక్ష్మీపతికి డిఎస్పీగా పదోన్నతి లభించడంతో ఆయన ఇక్కడనుంచి వెళ్ళిపోయారు. దీంతో ఎసీబీలో ఒకే ఒక్కడుగా సిఐ సుబ్బరాజు కొంతకాలం అంతా తానై చక్రం తిప్పారు. ఈ నేపధ్యంలో మద్యం సిండికేట్లపై దాడుల పర్వాన్ని జిల్లాలో తూతూ మంత్రంగానే ముగించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిపిన దాడుల్లో పాల్గొన్న ఇక్కడి సిఐ సుబ్బరాజు ఆ దాడుల సమాచారాన్ని లీక్ చేయడంతో పాటు కొందరి పేర్లను జాబితానుంచి తప్పించారన్న ఆరోపణలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఏసీబీ ఉన్నతాధికారులు ఆయన్ను మాతృశాఖకు సరండర్ చేశారు. దీంతో జిల్లాలో ఏసీబీ అధికారులు లేని విభాగంగా మారింది. ప్రస్తుతం విజయవాడ ఎసీబీలో సిఐగా పనిచేస్తున్న రవిని ఇక్కడ ఇన్ చార్జిగా నియమించారు. రోజుకోరకంగా మారుతున్న పరిమాణాల్లో ఆయన ఇటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-24-12225.html
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది