తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు. ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్లాన్ ఏమిటని చూస్తే.. ఆయన 2027వ సంవత్సరంలో తాను సరికొత్త చారిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆయన బహిరంగంగానే వెల్లడించారు. ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్‌ను రాబోయే కొద్ది నెలల్లోనే వైసిపి శ్రేణులు సిద్ధం చేయనున్నాయి. అయితే ఈసారి జగన్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. 2027లో అడుగు ముందుకు వేస్తే, మళ్లీ 2029 అసెంబ్లీ ఎన్నికల ముగింపు వరకు ఆయన నిరంతరం ప్రజల మధ్యే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయ చరిత్రను తిరగరాసి ఆయనకు బంపర్ మెజారిటీని తెచ్చిపెట్టింది. ఇప్పుడు 2026 దాటి 2027 రాగానే అదే మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను పూర్తిగా తన వైపు తిప్పుకోవడానికి ఈ సుదీర్ఘ పాదయాత్రే ఏకైక మార్గమని ఆయన నమ్ముతున్నారు.
ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు విషయానికి వస్తే.. ఆయన కూడా జగన్ రూట్ నే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయన కూడా ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే జగన్ పాదయాత్ర ద్వారా ప్రజలలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే.. కేసీఆర్ బస్సు యాత్ర అంటున్నారు. అదోక్కటే తేడా మిగతాదంతా సేమ్ టూ సేమ్. ఇద్దరూ ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికీ.. వచ్చే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి 2027ను కీలకంగా భావిస్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపు ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అయితే ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ 2027 ప్రారంభం నుండి కేసీఆర్ సరికొత్త అవతారంలో ప్రజల ముందుకు రానున్నట్లు ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీష్ రావు అధికారికంగా స్పష్టం చేశారు. 2027 నుండి కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషించబోతున్నారు. ఇందుకోసం ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గాన్ని తాకుతూ సాగే ఈ బస్ యాత్ర ద్వారా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ బాస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చూడాలి మరి ఏపీలో జగన్ పాదయాత్ర, తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్రలకు జన స్పందన ఎలా ఉంటుందో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-special-year-for---jagan-and-kcr-yatras-39-222313.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.