Publish Date:Nov 25, 2024
వివాదాస్పద అఘోరీపై మామునూరు పోలీస్ స్టేషణ్ లో కేసు నమోదైంది. నవంబర్ 19న వరంగల్ రంగసాయిపేట బెస్తం చెరువు స్మశానవాటికలో మండుతున్న చితి వద్ద కోడిని అఘోరీ బలి ఇచ్చింది. జంతుబలి ఇవ్వడం నిషేధం కాబట్టి కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. అఘోరీ వింత పూజలు చేస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసిందని రోహన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ యానిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫై యాక్ట్ క్రింద కేసు నమోదు చేయాలని రోహన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే స్మశాన వాటికలో వింత పూజలు చేస్తూ చితి మీదే పడుకోవడం ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడమేనని రోహన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. నన్నెవరూ ఏమీ చేయలేరని ఇప్పటి వరకు అఘోరీ చెబుతూ వస్తోంది. కానీ రోహన్ రెడ్డి ఫిర్యాదుచేయడంతో అఘోరీపై తెలుగు రాష్ట్రాల్లో మొదటి కేసు నమోదైందని చెప్పొచ్చు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-case-has-been-registered-against-aghori-25-188941.html
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.