రోజూ కామన్ గా తీసుకునే ఈ 6 ఆహారాలతో ఎంత డేంజరో తెలుసా..

Publish Date:Sep 19, 2023

Advertisement

ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన,  అందమైన చర్మం కావాలని కోరుకుంటాడు.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి తినే,  త్రాగే  ఆహారాలు, పానీయాలపై  శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.  రోజూ తినే కొన్ని ఆహారాలు చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మార్చడంలో సహాయపడతాయి.  వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే కొన్ని ఆహారాలు  ముఖంపై అకాల ముడతలు,  గీతలను కలిగిస్తాయి. చర్మ సంబంధిత సమస్యలను సృష్టిస్తాయి.  అందరూ ఆరోగ్యకరం అనుకుంటూ తీసుకునే ఎన్నో ఆహారాలు, పానీయాలు నిజానికి ఆరోగ్యం చేకూర్చకపోగా నష్టం కలిగించడంలో ముఖ్యంగా చిన్నవయసులోనే వృద్దులుగా కనిపించేలా చేస్తున్నాయి.   ఈ ఆహారాలు  గ్లైకేషన్‌ను పెంచి  కొల్లాజెన్‌ ను దెబ్బతీస్తున్నాయి. ఇది చర్మం సాగే గుణాన్ని తగ్గిస్తుంది.  ఇంతకూ ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

శుద్ధి చేసిన విత్తనాల నూనె..

సోయాబీన్, మొక్కజొన్న,  పొద్దుతిరుగుడు వంటి అనేక విత్తన నూనెలలో మంచి మొత్తంలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  కానీ శుద్ది చేసిన నూనెలలో ఒమేగా-3 ఉండదు. పెద్ద ఎత్తున శుద్ది చేయడం వల్ల  ఒమేగా -6 కొవ్వు  ఏర్పడుతుంది. ఇది  అధికంగా  వినియోగించడం వల్ల  శరీరంలో వాపు,  మంట,  చర్మంలో ఎరుపు, చికాకు,  మొటిమలు,  సోరియాసిస్ వంటి సమస్యలను కలిగిస్తుంది.

శుద్ధి చేసిన చక్కెర,  కార్బోహైడ్రేట్లు..

శుద్ధి చేసిన చక్కెర,  వైట్ బ్రెడ్ , స్వీట్లు వంటి అధిక గ్లైసెమిక్ ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, ఇవి  హార్మోన్లు,  నాడీ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి.

గ్లూటెన్..

గ్లూటెన్ అసహనం ప్రధానంగా జీర్ణక్రియ,  స్వయం ప్రతిరక్షక సమస్యలతో ముడిపడి ఉంటుంది. ఇది కొందరిలో  చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఉదరకుహర వ్యాధి, చర్మశోథ హెర్పెటిఫార్మిస్, దురద, పొక్కులు,  దద్దుర్లు మొదలైనవి గ్లూటెన్ అధికంగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు.

పాల ఉత్పత్తులు..

కొన్ని పాల ఉత్పత్తులు అలెర్జీలు కలిగి ఉంటాయి. ఇవి  ఆహార సున్నితత్వాన్ని ప్రేరేపిస్తాయి. ఈ కారణంగా  చర్మ సమస్యలను కలిగిస్తాయి. పాలలో కేసైన్,  లాక్టోస్ అసహనం కారణంగా ఇది జరుగుతుంది.

సోయా..

సోయాలో ఫైటోఈస్ట్రోజెన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ ప్రభావాలను అనుకరిస్తాయి. సోయా వినియోగం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  హైపర్పిగ్మెంటేషన్ వంటి సమస్యలను పెంచుతుంది. మంచి ప్రోటీన్ అని సోయాను అధికంగా తినే వారు, ఇతర హార్మోన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు సోయాకు దూరంగా ఉండాలి.

మొక్కజొన్న..

మొక్కజొన్నను అనేక రకాలుగా తింటారు. మొక్కజొన్న నేరుగా తింటే మంచిదే కానీ దీన్ని అనేక ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా చేస్తున్నప్పుడు అది పెద్ద స్థాయిలో ప్రాసెస్ చేయబడుతుంది.  కార్న్ ఫ్లేక్స్, కార్న్ బాల్స్, కార్మ్ ప్లోర్ వంటి వాటిలోనూ ఇంకా ఇతర ఆహారాలలో దీన్ని వినియోగిస్తారు. ఇలాంటి ఆహారాల ద్వారా దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి.

                                   *నిశ్శబ్ద.

By
en-us Political News

  
స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి... వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం ఏమిటి.. జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రాముఖ్యత, టిఫిన్‌లో పెట్టాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. పి. జానకి శ్రీనాథ్ వివరించిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి...
కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా..
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.