Publish Date:Aug 14, 2022
ఎదుటివారిని భయాందోళనకు గురిచేయడానికి అనేక వ్యూహాలు అనుసరిస్తారు. రాజకీయాల్లోనూ అంతకు మించే జరుగుతుంటుంది. రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రచారాలు చేయడంలో ఇటీవల బీజేపీ వారిని మించినవారు ఎవ్వరూ ఉండరు. తెలంగాణాలో ఎలా గైనా అధికారంలోకి రావాలన్న ఆతృతతో టీఆర్ ఎస్‌కు జంప్ జిలానీల సంఖ్య పెంచుతూ తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లెక్కను పెంచుతూ పోతున్నారు. టీఆర్ ఎస్ నుంచి ఏకంగా 50మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ నీడలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సంజయ్ అన్నారు.
జనాకర్షణ వదిలేసి ఇతర పార్టీల నాయకులను ఆకట్టుకోవడంలోనే బండి బాగా ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు టీఆర్ ఎస్ ని చిన్నపిల్లల్ని భయపెట్టినట్టు హెచ్చరికలు చేయడంలో బాగా ప్రావీణ్యం ప్రదర్శిస్తున్నారు. తాజాగా కేసీఆర్ బొమ్మతో ఎన్ని క ల్లోకి వెళితే గెలవలేమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, ఆ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు.
గతంలో 12 మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించిన బండి ఇపుడు ఆ సంఖ్యను ఏకంగా 50 కి పెంచారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఉత్సాహంతో ఆయన అలా ఆ సంఖ్య పెంచుతూ పోతున్నారన్న అనుమానం అందరికీ రాక పోదు. జనాన్ని చూస్తే వెర్రెక్కిపోవడంలా ఈ యాత్రలో సంజయునికి జనాన్ని చూడగానే వారికి లెక్క పెంచి చెబితే పార్టీ ఎంత శక్తి వంతంగా ముందడుగు వేస్తోందో వారికి తెలియజేయాలన్నఆలోచనా అందులో ఉంది. యాత్ర 11వ రోజు శనివారం (ఆగష్టు 13)యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కొనసాగింది. పొడిచేడు గ్రామంలో మలి ఉద్యమంలో తొలి అమ రుడైన కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మోత్కూరు అంబేడ్కర్ చౌరస్తాలో సంజయ్ మాట్లా డుతూ, ఉప ఎన్నిక రావాలన్నది కేసీఆర్ కోరిక అని, మునుగోడులో టీఆర్ ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకమై వచ్చినా బీజేపీ గెలుపును ఆపలేరన్నారు. సీఎం కుర్చీ కోసం కేసీఆర్ ఇంట్లో కొడుకు, బిడ్డ, అల్లుడి మధ్య లొల్లి మొదలైందని చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నయా నిజాం పాలన సాగుతోందని, ప్రజలు తమ ఆకాంక్షల సాధనకు మరోసారి పోరాడా లని, ఇదే చివరి ఉద్యమం కావాలన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి తమ పార్టీ ఉద్యమిస్తోందని, మేధావులు, కళాకారులు, అన్నివర్గాల ప్రజలు తమతో కలిసి రావాలని ఆయన కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/50-trs-mlas-ready-to-jump-says-bandi-25-141894.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.