విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర... ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్!

Publish Date:Jul 1, 2026

Advertisement

 

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన నలుగురిని అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా పెను భూకంపం సంభవించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి గండికొడుతూ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 

అయితే, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే సరికొత్త రాజకీయ సంక్షోభం తెరపైకి వచ్చింది. టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. ఎలైయరాజా తనకు రూ.35 కోట్ల భారీ లంచం ఆఫర్ చేశారంటూ చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. శాసనసభ స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదించబోయే ఒక కీలక తీర్మానంలో పార్టీ లైన్‌కు భిన్నంగా, తమకు అనుకూలంగా ఓటు వేయాలని కొందరు వ్యక్తులు తనపై ఒత్తిడి తెచ్చారని, ప్రలోభాలకు గురిచేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

ఎమ్మెల్యే ఎలైయరాజా జూన్ 29న గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌ కార్యాలయంలో అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చెన్నైలోని డి-1 ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు అత్యంత వేగంగా దర్యాప్తు జరిపి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అరంబాక్కానికి చెందిన తిరునావుక్కరసు, తిరుచిరాపల్లికి చెందిన నరేష్, మేడవక్కానికి చెందిన త్యాగరాజన్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ప్రాథమిక విచారణలో తిరునావుక్కరసు అనే వ్యక్తి 'ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్' (ఐపీడీఎస్) అనే ఒపీనియన్ పోలింగ్ సంస్థను నడుపుతున్నట్లు నటించి, ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఆదేశాల మేరకే తాను ఈ పని చేస్తున్నానని ఎమ్మెల్యేను నమ్మించే ప్రయత్నం చేసినట్లు తేలింది. రూ.35 కోట్ల భారీ మొత్తాన్ని ఆశగా చూపిస్తూ, ఒకవేళ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఈ విషయాన్ని బయటపెడితే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను అంతం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఎలైయరాజా వెల్లడించారు.

ఈ కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని లింకులు బయటపడుతున్నాయి. జైలు నుంచి విడుదలై, కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్న డీఎంకే మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీ సోదరుడు వి. అశోక్ కుమార్ హస్తం కూడా ఈ కుట్రలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడైన నరేష్‌ను అశోక్ కుమార్ చెన్నైలో స్వయంగా కలిసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) వ్యవహారంలో తిరునావుక్కరసు పూర్తిగా సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ ల సూచనల మేరకే పావులు కదిపినట్లు తెలుస్తోంది. 


ఈ పరిణామాలపై అధికార టీవీకే పార్టీ తీవ్రంగా స్పందించింది. అవినీతి, అక్రమ సంపాదన తమకు తెలియదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా ఘాటుగా విమర్శించారు. కేవలం ఎలైయరాజా మాత్రమే కాకుండా మరికొంతమంది టీవీకే ఎమ్మెల్యేలను కూడా లొంగదీసుకునేందుకు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, పోలీసులు కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

By
en-us Political News

  
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.