పాకిస్థాన్ లో సైనిక పాలన?
Publish Date:Aug 19, 2026
Advertisement
పాకిస్థాన్ లో సైనిక పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? ఆ దిశగా పాక్ మిలిటరీ అడుగులు వేస్తున్నదా అంటే.. పరిశీలకులు ఔననే అంటున్నారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహా పాలనను పాక్ మిలిటరీ కసరత్తు చేస్తోందని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ చెబుతున్నారు. ఈ మేరకుర ఇప్పటికే.. పాలనలో, ముఖ్యమైన నిర్ణయాధికారాల్లో సైన్యానికి శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలంటూ.. సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌కు ఆప్తులైన వర్గాలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత సమగ్ర ప్రణాళిక కేవలం తాత్కాలిక మార్పులకే పరిమితం కాకుండా.. దేశ రాజకీయ, ఆర్థిక నిర్మాణాలను పూర్తిగా పునర్వ్యవస్థీకరించేలా ఉన్నట్లు సమాచారం. కొత్త రాష్ట్రాలు , నూతన పాలనా విభాగాల ఏర్పాటుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాబడి, ఆర్థిక వనరుల పంపిణీ నియమాలనూ సవరించేలా ఉంది. శతాబ్దాలుగా పాక్ రాజకీయాలు, విదేశాంగ విధానంలో సైన్యం వెనుకుండి చక్రం తిప్పుతున్నప్పటికీ, ఈ పదేళ్ల ప్రణాళిక ద్వారా సైనాన్ని చట్టబద్ధంగా ప్రభుత్వ భాగస్వామిగా నిలబెట్టాలని భావిస్తున్నారు. పాలనా సంస్కరణల కోసం పాకిస్థాన్ మిలిటరీ, గా తుర్కియే, ఈజిప్ట్ దేశాల్లో అమలవుతున్న పాలనా వ్యవస్థల నమూనాలను మోడల్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తీసుకుంటోంది. పార్లమెంటరీ వ్యవస్థ కంటే అధ్యక్ష తరహా పాలన వల్ల విధానపరమైన నిర్ణయాలు వేగంగా, సమర్ధంగా తసుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆ ప్రతిపాదన విస్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సైన్యం రాజకీయ వ్యవస్థ మార్పు బలంగా కోరుకుంటుండటంతో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Presidential Rule in Pakistan, Pakistan Army Power, Field Marshal Asim Munir, Pakistan Constitutional Reforms, Pakistan Political Crisis
http://www.teluguone.com/news/content/-presidential-rule-in-pakistan-36-229268.html





