కోల్‌కతాలో ఘోర విషాదం.. దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి.!

Publish Date:Oct 18, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ సార్వజనిన్ దుర్గాపూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

శనివారం సాయంత్రం దుర్గామాతను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మండపం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆకస్మికంగా భారీ వర్షం కురవడంతో భక్తులు తలదాచుకునేందుకు పరుగులు తీశారు. అదే సమయంలో మండపం వద్ద తప్పుడు ప్రకటనలు చేయడంతో గందరగోళం నెలకొని, రద్దీ ఒక్కసారిగా పెరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇరుకైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా సిబ్బంది కొరత, జనసమూహాన్ని నియంత్రించడంలో వైఫల్యం కూడా తొక్కిసలాటకు కారణమైనట్లు అనుమానిస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. తొలుత 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ అనంతరం పూజా కమిటీ నిర్వాహకులు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో పూజా కమిటీ కార్యదర్శి, ఉపాధ్యక్షుడు కూడా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, హత్యకు సమానం కాని నరహత్యకు సంబంధించిన అభియోగాలు మోపారు.

ఈ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతాలో తన ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

మరోవైపు, ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు కలకత్తా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌), ఫ్యాక్ట్‌ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సిట్‌లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌), క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) సహా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులు సభ్యులుగా ఉండనున్నారు.

మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. గాయపడిన వారికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.పండుగ వేళ జరిగిన ఈ ఘోర దుర్ఘటన కోల్‌కతాలో తీవ్ర విషాదాన్ని నింపింది. భక్తుల రద్దీని నియంత్రించడంలో నిర్లక్ష్యం జరిగిందా? భద్రతా ఏర్పాట్లలో లోపాలే ప్రాణనష్టానికి కారణమయ్యాయా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

 

 

[ Kolkata Stampede, Kolkata Durga Puja Tragedy, West Bengal, Chorb​​agan Durga Puja, 19 Dead, 25 Injured, Amit Shah, Suvendu Adhikari, Kolkata Police, Durga Puja Stampede, SIT Investigation, Calcutta High Court, West Bengal Government, PM Relief Fund, Compensation to Victims, Kolkata Breaking News, Durga Puja Accident, Amit Shah   ]


 

By
en-us Political News

  
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్, లైక్స్ సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు రోజుకో ప్రమాదకర చర్యకు పాల్పడుతున్నారు.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
ఇంటర్నెట్ వినియోగం కేవలం పెద్దలకే పరిమితం కాదు, పిల్లలకు కూడా ఇదొక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు.. ఎన్నో ఆశలతో నిద్రలోకి జారుకున్నారు.. కానీ తెల్లవారేసరికి ఆ ఇంట్లో ఐదుగురు విగతజీవులుగా కనిపించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.