నియోజకవర్గాల పెంపు.. పునర్విభజన చట్టంలో ఉన్నా.. మొండి చెయ్యే!

Publish Date:Sep 20, 2022

Advertisement

కొన్నివార్తలు అంతే, చస్తూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. పునరపి జననం.. పునరపి మరణం...అన్నట్లు అన్నమాట. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపుకు  సబందించిన వార్త కూడా అంతే. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన చాలా చాలా చెల్లని హామీలలో ఇది కూడా ఒకటి. ఎపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అనేక ఉత్తుత్తి హమీల్లాగానే, ఉభయ తెలుగు తెలుగు రాష్టాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెంచే హామీ కూడా ఉత్తుత్తి హమీనే అనే  విషయం అందరికీ తెలిసిందే.

అయినా, నియోజక వర్గాల పెంపు అనే మాట వినగానే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సందడి మొదలవుతుంది. నిజానికి ఇందుకు సంబంధించి గడచిన ఎనిమిదేళ్ళలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్ లో అనేక సందర్భాలలో ప్రస్తావన తెచ్చారు.అయితే ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం, అది ఇప్పట్లో కాదని ఖరాఖండిగా చెపుతూనే వుంది. 2026 జనాభా లెక్కలు తేలిన తర్వాత చూద్దాం అన్నట్లుగా దాటవేస్తోంది.  అయితే ఇప్పడు కొత్తగా మరో ఆశ చిగురించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆంధ్ర ప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని, కానీ, ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆ ప్రక్రియ  మొదలు పెట్టలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రావు రంజిత్‌ వివరించారు. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధన మేరకు అక్కడ నియోజక వర్గాలను పెంచడానికి డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిందనీ, అదే నిబంధన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కేంద్రం   చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు.

జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే, సుప్రీం ధర్మాసనం కేంద్ర, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఈసీకి నోటీసులు జారీ చేసింది.   ఇంతవరకు రాజకీయ  పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇదే ప్రశ్న వేసినా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టిచుకోలేదు. మంత్రులు నియోకజకవర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని సమధాన్నాని దాట వేస్తూ వచ్చారు. అయితే ఇప్పడు, సుప్రీం కోర్టు  నోటీసులు జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.  

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ఏదో ఒక వైఖరి తీసుకోకుండా ఇక కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని న్యాయనిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.  నిజానికి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాలను పెంచాలని రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ కేంద్రానికి టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయితే, నియోజక వర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ ఆవు కథను వినిపిస్తూ వచ్చింది. అయితే తెరాస నియోజక వర్గాలు పెంచాలని కోరినా, బీజేపీ ప్రభుత్వం కాదన్నా అందుకు ప్రధానంగా రాజకీయమే కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయంగా లాభ నష్టాలను బీజేపీ బేరీజు వేసుకుంటుందని, నియోజక వర్గాలు పెంచితే తమకు అనుకూలమని అంచనాకు వస్తేనే ఈ అంశంపై ముందుకెళ్లే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. అప్పటి వరకూ కేంద్రం కాలయాపన చేస్తూనే ఉంటుందని చెబుతున్నారు.

కాగా, తెలంగాణలో నియోజక వర్గాలు పెరిగితే రాజకీయంగా తమకు నష్టం జరుగుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజక వర్గాల్లోనే మెజారిటీ స్థానాల్లో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని, నియోజక వర్గాలను పెంచితే బలమైన అభ్యర్థులు దొరకడం కష్టతరమన్నది వారి అభిప్రాయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, తెరాస నియోజక వర్గాల సంఖ్య పెరిగితే మరింత మంది పార్టీ నేతలకు అవకాసం కలిపించి,అసంతృప్తిని తగ్గించుకోవచ్చని ఆశిస్తోంది. అయితే, కోర్టుల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే సరికి పుణ్య కాలం పూర్తవుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.