ఏ పార్టీకీ పొలిటికల్ మైలేజీ దక్కనీయకపోవడమే కాక్రోచ్ ల విజయం.!
Publish Date:Jul 30, 2026
Advertisement
దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు, రద్దుల చుట్టూ చెలరేగిన విద్యార్థుల ఆగ్రహజ్వాలలు చివరకు దేశ రాజధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. ఏ ఉద్యమమైనా సరే, విద్యార్థులు రోడ్డు మీదకు వస్తే ప్రభుత్వాల పునాదులు కదులుతాయని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో కూదా దాదాపు అదే జరిగింది. ప్రశ్నించే గొంతుకలపై లాఠీఛార్జ్, పెల్లెట్ గన్లు, చివరికి కరెంట్ షాక్ ఇచ్చే బ్యాటన్లు వాడినా... యంగ్ ఇండియా ఇసుమంతైనా తగ్గలేదు. వ్రస్థాయి నిరసనలు, విద్యార్థుల అకుంఠిత పోరాటం ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది! అయితే దీని వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి? విద్యాశాఖ మంత్రి రాజీనామా నైతిక బాధ్యతతో చేశారా? విద్యార్థి ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి వేసిన ఎత్తడగా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖను పరిశీలిస్తే.. పరీక్షల నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాననడం కాకుండా.. దేశద్రోహ శక్తులు ఈ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే తాను పక్కకు తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. అసలు పరీక్షల లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైతే, న్యాయం కావాలని అడిగిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దేశద్రోహుల బీ-టీమ్ అని ప్రచారం చేయడమేంటి? అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయనే చెప్పాలి. ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థి నాయకుల వయస్సు, ఉద్యోగంపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పరీక్షల రద్దు వల్ల వచ్చిన సమయాన్ని విద్యార్థులు మరింత ప్రిపేర్ అవ్వడానికి వాడుకున్నారనేలా వ్యాఖ్యానించడంపై విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రధాన్ స్థానంలో నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడం ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. గతంలో బిల్కిస్ బానో కేసులోని ముద్దాయిల విడుదలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్లో అధికిర కూగయొపై విరుచుకుపడ్డాయి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన కీలక సమయంలో, వివాదాస్పద నేపథ్యం ఉన్న నేతకు విద్యాశాఖను అప్పగించడంపై విద్యార్థి సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేలా ఒక కొత్త బిల్లును సిద్ధం చేస్తోంది. కానీ, ఈ తాత్కాలిక చట్టాలు, నాయకుల మార్పులు విద్యార్థుల నిరసనల తీవ్రతను తగ్గించగలవా? అంటే మాత్రం తగ్గించలేవనే సమాధానమే వస్తోంది. తమపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత తేగల వ్యవస్థాత్మక మార్పులు కావాలని విద్యార్థిలోకం ఎలుగెత్తుతోంది. తాజాగా రైతుల ఆందోళనలకూ యువత సంఘీభావం ప్రకటించింది. మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది. ఆందోళనలను, ఉద్యమాలనూ అణచివేయడానికి అధికార పార్టీ, ప్రభుత్వం ఎన్ని వ్యూహాలురచించినా యువగళంముందు అవేవీ పారవని తాజా ఆందోళనలు నిర్ద్వంద్వంగారుజువుచేశాయి. ఇక ఈ ఉద్యమం సాధించిన మరో గొప్ప విజయం ఏమిటంటే.. ఏ రాజకీయ పార్టీకీ పొలిటికల్ మైలేజీ దక్కనీయకపోవడం. Dharmendra Pradhan Resignation, Student Unrest, Pralhad Joshi Education Minister, Paper Leak Controversy, BJP Strategy, politicalmilage, TeluguOne
http://www.teluguone.com/news/content/-dharmendra-pradhan-resignation-39-227553.html





