తిరుమలలో భక్తుల రద్దీ

Publish Date:Jan 1, 2023

Advertisement

ఆయన వడ్డీ కాసుల వాడు.. వడ్డీ సహా వాసులు చేస్తాడు. ఏ కారణంగా అయినా ఆయనకు ఇస్తానన్నది ఇవ్వక పోయినా, చెల్లించవలసినది చెల్లించక పోయినా వదిలి పెట్టడు. ధర్మ వడ్డీ లెక్కకట్టి మరీ వసూలు చేస్తాడు. ఇక మొక్కుకుని మరిచి పోయానంటే అసలే వదిలి పెట్టడు. ముక్కు పట్టుకుని ఈడ్చుకు వెళ్లి మొక్కులు రాబట్టు  కుంటాడు. తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి వారి గురించి భక్తుల విశ్వాసం.

 అయితే గడచిన రెండేళ్ళలో  కరోనా కారణంగా ప్రయాణ సదుపాయాలు లేక పోవడం వల్లనైతే నేమి, కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న కారణంగా 2020 మార్చి నుంచి ఆలయంలోకి భక్తులకు టీటీడీ అనుమతించక పోవడం వల్లనైతేనీమే, దాదాపు 83 రోజులపాటు శ్రీనివాసుడికి ఏకాంతంగానే సేవలు నిర్వహించడం వల్లనైతే నేమీ, ఏడు కొండలకు భక్తుల రద్దీ చాల వరకు తగ్గి పోయింది. అయితే, ఈ ఏడాది ( 2022)  కరోనా ప్రభావం తగ్గటంతో పూర్తి స్థాయిలో తిరుమల ఆలయంలోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. 2022 ఉగాది నుంచి కరోనా నిబంధనలు పూర్తిగా తొలగించారు. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది స్వామి వారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. అలానే కానుకలు, ముడుపుల, హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలోనే సమకూరింది. 

సాధారణంగా టీటీడీ వార్షిక బడ్జెట్ హుండీ ఆదాయంపై‌ ఆధారపడి ఉంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను  రూ.3,116.25 కోట్లతో టీటీడీ బడ్జెట్ ను అంచనా వేసింది. తర్వాత దాన్ని రూ. 3,243. 19 కోట్లకు సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేశారు.. అంచనా కన్నా 50 కోట్ల రూపాయలు అధికంగా భక్తులు హుండీలో సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. ఇవి కరోనా రాక ముందు పద్దులు. కొవిడ్ వచ్చినప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా.. టీటీడీ అంచనాలను తలక్రిందులు చేస్తూ 721 కోట్లు రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో వార్షిక బడ్జెట్ ను సవరించి రూ. 2,553 కోట్లకు కుదించారు. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,837 కోట్ల రూపాయలు అంచనా వేశాయి పాలక వర్గాలు. 

2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 21-22ఆర్థిక సంవత్సరానికి 2,937.85 కోట్ల రూపాయలకు పాలకమండలి సభ్యులు పచ్చజెండా ఊపారు.. కోవిడ్ ‌తరువాత భారీగా భక్తుల‌ సంఖ్య‌ పెరగడంతో‌ గతంలో‌ మాదిరే హుండీ ఆదాయంతో‌ పాటుగా, కళ్యాణ‌ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూములు లీజు‌ వంటి రూపాల్లో‌‌ ఆదాయం‌ పెరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగటంతో పాటుగ హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు కానుకలు సమర్పించారు.

ఈ క్రమంలో 2022 సంవత్సరానికి గాను శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయ లెక్కలను టీటీడీ విడుదల చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,35, 58,325 కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే రూ. 1446 కోట్లు హుండీ, విరాళాల రూపంలో వచ్చాయి. 1,08,51,706 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. 11,42,78,291 శ్రీవారి లడ్డులను భక్తులకు విక్రయించారు. అయితే వెంకన్న దేవును ఆదాయం పెరిగిన స్థాయిలో భక్తుల సౌకర్యాలు పెరగడం లేదు. మరో వంక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీటీడీలో అన్యమతస్తుల ప్రమేయం,అన్యమతస్థులు అరాచకాలు పెరిగి పోయాయనే విమర్శలు ఎకువయ్యాయి. ఇక టీటీడీలో నిధుల  దుర్వినియోగం, ఆస్తుల విక్రయం వంటి ఆరోపణల గురించి అయితే చెప్పనే అక్కర లేదు. చివరకు వెంకన్న హుండీలో కానుకలు వేయవద్దని ప్రధాన అర్చకులే భక్తులకు విజ్ఞప్తి చేశారంటే .. పరిస్థితి ఏమిటో వేరే చెప్పనకరలేదని అంటున్నారు

By
en-us Political News

  
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.