స్వతంత్ర సిట్ నియామకంలో జాప్యం ఎందుకు?

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో  జంతువుల కొవ్వు కల్తీ  నెయ్యి విషయంలో  కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్వతంత్ర సిట్ దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ స్వతంత్ర సిట్ లో సీబీఐ, సిట్, ఫాస్సీఅధికారులు ఉంటారు. అయితే సుప్రీం తీర్పునకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ  నెయ్యిపై సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ దర్యాప్తు ప్రారంభించేసింది కూడా.

అయితే కేసు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ సిట్ దర్యాప్తును నిలిపివేసింది.  సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్వతంత్ర సిట్ నియామకం వెంటనే జరుగుతుందని అంతా భావించారు. కానీ సుప్రీం ఆదేశించి వారం దాటిపోయినా ఇప్పటి వరకూ ఇండిపెండెంట్ సిట్ నియామకం జరగలేదు. అంతే కాదు ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన కూడా ఏదీ రాలేదు.  ఇండిపెండెంట్ సిట్ నియామకారిని సుప్రీం కోర్టు నిర్దిష్టగడువు ఏదీ విధించక పోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.  ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు అయ్యాకా, ఆ సిట్ దర్యాప్తును సీబీఐ చీఫ్ పర్యవేక్షిస్తారు.

ఇప్పటికైనా ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకుని ప్రకటించాల్సిన అవసరం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో దోషులను తేల్చి సత్వరమే శిక్షించకుంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనడంలో సందేహం లేదు.