రాష్ట్రాల పన్నుల వాటా విడుదల ఏపీకి ఎంతంటే?

మోడీ నేతృత్వంలో కేంద్రంలో కొలువుదీరి ఉన్న ఎన్డీయే సర్కార్ రాష్ట్రాలకు పన్నుల వాటాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు నెలవారీగా అందించే పన్నుల వాటా కింద కేంద్రం 1, 78, 173 వేల కోట్లు విడుదల చేసింది.

ఇందులోనే అడ్వాన్స్ పేమెంట్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. కేంద్రం విడుదల చేసిన పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్ కు 7వేల 211 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3 వేల 745 కోట్ల రూపాయలు దక్కుతాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ కు కేంద్ర నుంచి 31వేల 963 కోట్ల రూపాయలు లభిస్తాయి.  

ఇక బీహార్ కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్ కు 13,987 కోట్లు, మహారాష్ట్రకు రూ.11,255 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.13,404 కోట్లు, రాజస్థాన్ కు రూ.10,737 కోట్లు, ఒడిశాకు రూ.8,068 కోట్లు పన్నుల వాటా రూపేణా దక్కనున్నాయి.