రతన్ టాటా అసిస్టెంట్ శంతన్ నాయుడు మన తెలుగు వాడే 

పరిచయం అక్కర్లేని పేరు రతన్ టాటా. రతన్ టాటా వద్ద ఉద్యోగంలో చేరాలంటే పెద్దగా అర్హత అవసరం లేదు. నిజాయితీ, చిత్త శుద్ది ఉంటే రతన్ టాటా వద్ద చేరిపోవచ్చు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన శంతన్ నాయుడు రతన్ టాటావద్ద అసిస్టెంట్ గా చేరాడు. ఒక ఉద్యోగి కంటే ఒక ఫ్రెండ్ మాదిరిగా ఉండిపోయాడు. రతన్ టాటా భుజాల మీద చెయ్యివేసి దిగిన ఫోటోలు చూస్తుంటే శంతన్ నాయుడు ఏ రేంజ్ లో గుర్తింపు పొందాడో అర్థం చేసుకోవచ్చు.శంతన్ నాయుడు పూర్వికులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు. బతుకుతెరువు కోసం పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రకు వలస వెళ్లారు. 1993 లో జన్మించిన శంతన్ నాయుడు పూణే యూనివర్శిటీ నుంచి  2014 లో ఇంజినీనింగ్ పూర్తి చేశాడు.  డిజైన్ ఇంజినీర్ గా టాటా గ్రూప్ లో చేరాడు. శంతన్ నాయుడు  స్టార్టప్ ద్వారా రతన్ టాటా గుర్తించారు. బాగానే ఇన్వెస్ట్ చేశారు. గుడ్ ఫెలో స్ అనే ఈ స్టార్టప్ కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టిన రతన్ టాటా ఎంత ఇన్వెస్ట్ చేశారో గోప్యంగా ఉంచారు. వృద్దులకు సాయం చేసే ఈ స్టార్టప్ కంపెనీ పూర్తిగా శంతన్ నాయుడుకు చెందినది. వాన ప్రస్థంలో రతన్ టాటాకు అన్నీ తానై బాగా చూసుకున్నాడు ఆయన అసిస్టెంట్ శంతన్ నాయుడు. 
ముఖ పరిచయం కూడా లేని శంతన్ నాయుడును తన వద్దే అసిస్టెంట్ గా చేర్చుకుని  చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగేవారు. జోకులు పేల్చుకునే వారు. 84 ఏళ్ల రతన్ టాటా 20 ఏళ్ల శంతన్ నాయుడుతో ఫ్రెండ్ షిప్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. బిజినెస్ లో  ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహించిన గొప్ప మానవతావాది రతన్ టాటా . శంతన్ నాయుడు కూడా రతన్ టాటా నమ్మకాన్ని వమ్ము చేయకుండా  రతన్ టాటా వెంటే ఉన్నారు.  ఇష్టానికి కష్టం తోడైతే  చిన్న వయసులో పెద్ద విజయం సాధించవచ్చు అని శంతన్ నాయుడు నిరూపించుకున్నాడు.