విశాఖ శారదాపీఠంలో విషజ్వర పీడా హర యాగానికి పూర్ణాహుతి
posted on Mar 28, 2020 1:19PM
*వైద్యులను ధన్వంతరి రూపంగా భావించండి: స్వామి స్వరూపానంద
* పోలీసులను దేశ సైనికులుగా భావించి , గౌరవించండి: స్వామి స్వరూపానంద
విశాఖ శ్రీ శారదాపీఠం లో 11 రోజులపాటు సాగిన అమృత పాశుపత సహిత విషజ్వర పీడా హర యాగం. యాగాన్ని పర్యవేక్షించిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర. సర్వ మానవాళి ఆయురారోగ్యాలతో ఉండాలనే యాగం చచేసినట్టు వెల్లడించిన స్వామి స్వరూపానందేంద్ర. పూర్ణాహుతి సందర్భంగా అనుగ్రహ భాషణం చేసిన స్వామి స్వరూపానందేంద్ర -" ప్రపంచానికి భారత దేశం గురుస్థానంలో ఉంది. వేదాల్లో ఉన్న అనేక అంశాలను పరిశీలించి యాగం తలపెట్టాం. అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు, ధన్వంతరి జపం, అపమృత్యు దోష నివారణతో కూడిన మంత్రాలతో యజ్ఞం చేసాం, " అని విచారించారు. " ఈ యాగం విజయవంతంగా ముగిసింది. ప్రధాని మోడీ, సీఎంలు కేసీఆర్, జగన్ ల ఆదేశాలను తుచ తప్పక పాటించండి. ధన్వంతరి రూపంగా భావించి వైద్యులను ఆరాధించండి. పోలీసులను దేశ సైనికులుగా భావించి గౌరవించండి," అని ప్రజలకు విజ్ఞప్తి చేసిన స్వామి స్వరూపానందేంద్ర, ఆకలితో అలమటిస్తున్న వారికి టీటీడీ, దేవాదాయ శాఖ అన్నప్రసాదాలు పంపిణీ చేయాలనీ, విశాఖ శారదాపీఠం భక్తులంతా అన్నార్తులను ఆదుకోవడానికి ముందుకు రావాలనీ కూడా పిలుపునిచ్చారు.