వెనుజువెలా.. అసలేం జరుగుతోంది?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా జరుగుతున్న హాట్ డిస్కషన్ ఏమిటంటే.. అసలు వెనిజువేలాలో ఏం జరుగుతోంది? ఈ నెల 3న అంటే శనివారం అమెరికన్ ఆర్మీ మెరుపుదాడి జరిపివెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి అమెరికాకు తరలించింది.  ఈ సందర్భంగా వెనిజువేలా  రాజధాని కకరాకస్ లో భారీ పేలుళ్లు జరిగాయి.

విద్యుత్ గ్రిడ్ లు ధ్వంసమయ్యాయి. దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫోన్ చార్జింగ్ కోసం జనం బారులు తీరారు.  అమెరికా అద్యక్షుడు ట్రంప్ దీన్ని అమెరికన్ సైనిక శక్తి అద్భుత ప్రదర్శ నగా అభివర్ణిస్తూ తన భుజాలను తానే చరుచుకున్నారు. ఇక వెనిజువేలాలో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని ప్రకటించారు.   అయితే మదురో బదులు తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని అంటు న్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కొరినా మచాడో తర్వాతి అధ్యక్షురాలయ్యే  చాన్సుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే అదేమీ జరిగేలా కనిపించడం లేదు.. ఎందుకంటే   కొరినా మచాడో నునోబెల్ స్వీకారానికి కూడా అవకాశం దొరకని ఇబ్బందికర  పరిస్థితులను ఎదుర్కు న్నారు. ప్రస్తుతం మదురోను అమెరికా అరెస్టు చేయడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భారత్ అయితే వెనుజువెలా వెళ్లే వారు అత్యవసరమైతే తప్ప వెళ్ల వద్దని ట్రావెల్ కాషన్ జారీ చేసింది.

అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అయిన డెల్టా ఫోర్స్ .. ఆపరేషన్ ఆబ్సల్యూట్ రిజాల్వ్  పేరిట రాజధాని కరాక స్‌లో భారీ సైనిక దాడి చేసింది. ఈ దాడిలో మదురో నివాసంపై హెలికాప్టర్లతో దాడి చేసి, మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. మదురో దంపతులను ముందుగా యుఎ స్ఎస్ ఐవో జిమా యుద్ధ నౌకలోకి, ఆ తరువాత న్యూయార్క్‌లోని స్టూవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేర్చారు. ప్రస్తుతం మదురో బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు.

మదురోపై 2020 నుంచి అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఇండిక్ట్‌మెంట్ ఆధారంగా.. నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, మెషిన్‌గన్స్ ఇతర డిస్ట్రక్టివ్ డివైసెస్ పొజెషన్ వంటి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే  మదురోపై  50 మిలియన్ రివార్డ్ ప్రకటించింది అమెరికా. ఇప్పుడు మదురోను మెరిపుదాడి చేసి మరీ అరెస్టు చేసింది.  అరెస్ట్ సమయంలో మదురో ఇంట్లో నిద్రిస్తున్నారని, అతడి నుంచి  ఎలాంటి  ప్రతిఘటన లేకుండానే బంధించారనీ తెలుస్తోంది. అయితే అరెస్టు తర్వాత   మదురో చేతులకు సంకెళ్లతో అమెరికా ఆఫీసర్ల మధ్య నడుస్తున్న దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అ య్యాయి. మదురో అరెస్టును  . చైనా, రష్యా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయిజ అయితే కొన్ని దేశాలు ఈ అరెస్టును స్వాగతించాయి. ఇలా ఉండగా మదురో అరెస్టు అంశంపై  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu