జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగుల ఆందోళన

 

జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అశోక్‌నగర్, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు  రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలతో ఆశోక్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. 

అభ్యర్థులను చెదరగొట్టిన పోలీసులు.. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే వారందరినీ విడుదల చేసి, స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని   తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా  నిరుద్యోగులకు కవిత సంఘీభావం తెలిపారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu