పరకామణి కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

 

తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడి రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని పేర్కొంది. రవికుమార్ కుటుంబానికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని , ఈ వ్యవహారంలో టీటీడీ, అధికారులకు నిబంధనలు పాటించలేదని తప్పుబట్టింది. బాధ్యలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఛార్జిషీటు వేసే వరకు కేసును స్వయంగా పర్యవేక్షిస్తామని స్ఫష్టం చేసింది.టీటీడీలో భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకలను లెక్కించే విభాగమైన పరకామణి లో రవికుమార్ అనే పెదజీయర్ మఠం ఉద్యోగి చోరీ చేశాడు.  

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలో పనిచేసే కొందరు సిబ్బంది, ఇతర వ్యక్తులతో కలిసి హుండీ నగదును అపహరిస్తూ దొరికపోయారు. అప్పట్లో పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అయితే  టీటీడీ విజిలన్స్ సిబ్బంది రాజీ చేసుకుని అతను ఇచ్చిన ఆస్తులను టీటీడీపై బదిలీ చేశారు. ఇలా దొంగ దొరికిపోతే రాజీ చేసుకోవడం.. ఏమిటని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అతనికి అంత పెద్ద మొత్తం ఆస్తులు ఎలా వచ్చాయి.. దొంగతనం ఎంత కాలం జరుగుతోందన్న అంశంపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ముగ్గురు పోలీసుల పాత్ర కూడా బయటపడింది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu