సీక్రెట్ పై సీరియస్.. ఎవరిని వదల.. ముందస్తు ముచ్చట.. టాప్ న్యూస్@7PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమమంలో ఇచ్చిన విభజన హామీల అమలుకు పదేళ్ల సమయం పడుతుందని కేంద్ర హోంశాఖ తెలిపింది. టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. విభజన హామీల అమలు పనులు కొన్ని పలు దశల్లో ఉన్నాయని పేర్కొంది. హామీల అమలుపై హోంశాఖ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తోందని పేర్కొంది. ఇప్పటివరకు కేంద్రహోం శాఖ 25 సమీక్షలు నిర్వహించిందని తెలిపింది. -----జీవోఐఆర్టీ వెబ్‌సైట్‌లో జీవోలు ఎందుకు పెట్టట్లేదని ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగిపోయే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై సీరియస్ అయింది. వెబ్‌సైట్‌లో ప్రభుత్వ జీవోలను ఉంచకపోవడంపై తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్లో ఐదు శాతం మాత్రమే వెబ్ సైట్‌లో ఉంచుతున్నారని వాదించారు. -------
‘‘నా తల్లిని విమర్శించడం బాధించింది. నా తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టం’’ అని టీడీపీ నేత నారా లోకేశ్‌ హెచ్చరించారు. మంగళగిరిలోని పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు లోకేష్. నిడమర్రు రోడ్డులో డంపింగ్‌ యార్డును ఆయన పరిశీలించారు. డంపింగ్‌ యార్డు మారుస్తామని చెప్పి ఎమ్మెల్యే మాట తప్పారని దుయ్యబట్టారు. వరద బాధితులను ఆదుకుంటే ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. 
-------
ఆలయ సంస్కృతి, సంప్రదాయాలకు వైసీపీ తిలోదకాలు ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రామతీర్థంలో అశోక్ గజపతిరాజును అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి వెల్లంపల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శంకుస్థాపనపై ధర్మకర్తల మండలితో చర్చించకపోవడం జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు నిదర్శనమన్నారు. 
-----
కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో వాదనలు వినబోనని జడ్జి  జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ స్పష్టం చేశారు. కేసు విచారణను మరో బెంచ్‌కి పంపాల్సిందిగా సీజేకి సమాచారం పంపారు. బుధవారం కేసు విచారణ సందర్భంగా కొండపల్లి కౌన్సిలర్ల తరపు న్యాయవాది, బెంచ్‌తో వాదనకు దిగడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేసి వెళ్లారు.
-------
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర నేతలతో  జరిగిన సమావేశంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని వ్యాఖ్యానించారని సమాచారం. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లొచ్చని  అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. తనకున్న ఇన్‌పుట్స్ ఆధారంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు
----
గుంటూరు జిల్లా అమరావతి పీఎస్‌లో వైసీపీ నేత వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో పోలీసులపై బూతు పురాణం అందుకున్నాడు. ఇసుక రవాణా చేస్తున్న తన ట్రాక్టర్‌ను ఆపారంటూ పోలీస్‌ స్టేషన్‌కు వైసీపీ నేత తాగొచ్చాడు. విషయం బయటకు రాకుండా వైసీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో వైసీపీ నేత బూతు పురాణం వైరల్‌గా మారింది.  
-------
ఏపీలో రెండో ఒమైక్రాన్‌ కేసు నమోదయింది. తిరుపతిలో మహిళకు ఒమైక్రాన్‌ పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కెన్యా నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి తిరుపతికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఒమైక్రాన్‌ బాధిత మహిళను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు
------
హైదరాబాద్ నగరంలోని 10 పబ్‌లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 31లోగా పబ్‌లను కట్టడి చేయాలని సూచించింది. రెసిడెన్షియల్ ప్రాంతంలో పబ్‌లకు అనుమతి ఇస్తున్నారంటూ.. దాన్ని సవాల్ చేస్తూ దాకలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో 10 పబ్‌లకు నోటీసులు జారీ చేసింది.పబ్‌ల అరాచకాలపై జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు పిటిషన్‌ వేశారు.
-----
పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతమయ్యాయని కేంద్రం ప్రకటించింది. అయితే విపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండానే హడావిడిగా బిల్లులు ఆమోదించారని, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చించాలని తాము కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నాయి. షెడ్యూల్ తేదీ కంటే ఒకరోజు ముందుగా బుధవారంనాడు పార్లమెంటు సమావేశాలు నిరవధింగా వాయిదా పడ్డాయి.