టెస్లా స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర ఎంత‌? ఫీచ‌ర్స్‌ ఏంటి?

టెస్లా. ఎల‌క్ట్రిక్ కార్లు, అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు, శాటిలైట్లు.. లేటెస్ట్‌గా స్మార్ట్‌ఫోన్లు. అన్నిట్లోనూ ఎలాన్ మ‌స్క్ మార్క్ త‌ప్ప‌క క‌నిపిస్తుంది. రొటీన్‌కు భిన్నంగా, మిగ‌తా వాటికంటే సంథింగ్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అందుకే, టెస్లా కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్ రాబోతోందంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆస‌క్తి పెరిగింది. మార్కెట్‌ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆ ఫోన్‌ పేరేంటి? ధరెంత ఉంటుంది? ఏమేం ఫీచర్లు ఉంటాయి? ఫోన్‌ను ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు? లాంటి విశేషాల‌పై నెటిజన్లు ఇంట్రెస్టింగ్‌గా సెర్చ్ చేస్తున్నారు. ఇంత‌కీ టెస్లా ఫోన్ ప్ర‌త్యేక‌త‌లేంటంటే....

మోడల్‌ పై/పీ (Model Pi/P) పేరుతో టెస్లా ఫోన్ రాబోతోంద‌ని తెలుస్తోంది. కంప్లీట్ గేమింగ్ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌ చేయనుంది. పైభాగంలో నేవీ బ్లూ.. వెన‌క‌ స్కై బ్లూ క‌ల‌ర్‌లో ఫోన్ ఉంటుంద‌ని అంటున్నారు. ఐఫోన్‌కు యాపిల్ సింబ‌ల్ ఉన్న‌ట్టు.. ఈ ఫోన్ వెనుక వైపు ‘T’ అక్షరంతో టెస్లా లోగో ఉంటుందని వార్త‌లు వ‌స్తున్నాయి. 

టెస్లా ఫోన్‌లో 108 ఎంపీ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు ఉంటాయట. 6.5 ఇంచెస్‌ స్క్రీన్‌.. 4K రిజల్యూషన్ డిస్‌ప్లే.. స్నాప్ డ్రాగన్‌ 898 ప్రాసెసర్‌.. 2 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ ఉంటుంద‌ట‌. అయితే, టెస్లా ఫోన్‌ ఓఎస్‌ గురించి వివ‌రాలు మాత్రం ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు. కొత్త ఓఎస్‌ను తీసుకొస్తారా?  లేక‌, అండ్రాయిడ్‌లాంటి వాటితోనే ప‌ని కానిచ్చేస్తారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ప్రస్తుతం టెస్ట్ మోడ్‌లో ఉన్న టెస్లా ఫోన్‌.. వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి రిలీజ్ కానుంది. 

టెస్లా స్మార్ట్‌ఫోన్‌ ధర 800 డాలర్ల నుంచి 1,200 డాలర్ల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 60 వేల నుంచి రూ. 90 వేలు ఉండొచ్చు. టెస్లా ఫోన్.. యాపిల్ ఐఫోన్‌, శాంసంగ్‌, వ‌న్‌ప్ల‌స్ ఫోన్స్‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయం. అయితే, టెస్లా ఫోన్ గేమింగ్ సెగ్మెంట్లో రానుండటంతో వేటి మార్కెట్ వాటికే అంటున్నారు.