తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అరుదైన రికార్డు

తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్ గా కోనేరు హంపి నిలిచి అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నారు.  టోర్నీలో ఆమె దూసుకెళ్లింది. 8.5 పాయింట్ల తో అగ్ర స్థానంలోకి దూసుకెళ్లింది. 2019లో హంపి చెస్ చాంపియన్ అయింది. కోనేరు హంపి గ్రాండ్ మాస్టర్  చైనా గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా  పేరు గడించింది. ఇదే టోర్నీలో మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. 2024 మన దేశ చెస్ క్రీడాకారులకు మర్చిపోలేని సంవత్సరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.