పేర్నినానివి కట్టు కథలు : కొల్లు రవీంద్ర
posted on Dec 29, 2024 1:31PM
కృష్ణా జిల్లాలో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి కొల్లు రవీంద్ర మధ్య డైలాగ్ వార్ రోజురోజుకు ముదురుతోంది. పేర్నినాని భార్య జయసుధను అరెస్ట్ చేయనున్నట్టు కొల్లు రవీంద్ర చేసిన ప్రకటనపై పేర్ని నాని కట్టు కథలు అల్లుతున్నారు. ఇంట్లో ఆడవాళ్ల మీద కేసులు ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టు పేర్ని నాని కట్టు కథలు అల్లినట్టు కొల్లు రవీంద్ర స్టేట్ మెంట్ ఇచ్చారు. వీరి మధ్య పంచాయతీ ముదురుతోంది. నన్ను అరెస్ట్ చేయాలని కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నట్టు కట్టు కథ అల్లారని అన్నారు. రేషన్ బియ్యం స్వంత గోడౌన్ నుంచి స్మగ్లర్లకు తరలించారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కేసు నమోదైన నాటి నుంచి పేర్ని తప్పిచుకుతిరుగుతున్నాడని కొల్లు రవీంద్ర అన్నారు.ప్యాంటు తడుపుకున్న పేర్ని నెలరోజులు మాయం అయ్యాడని కొల్లు అన్నారు. నీ తప్పే లేనప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. పేర్ని భార్య జయసుధ గోడౌన్ నుంచి 7 500 బియ్యం బస్తాలు ఏమయ్యాయని మంత్రి ప్రశ్నించారు