రూ. 3,04,965 కోట్లతో భట్టి పద్దు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 3లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అదే సమయంలో అభివృద్ధిపైనా దృష్టి పెట్టారు మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. పారదర్శకత, అక్కౌంటబులిటీతో ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతోందని పేర్కొన్నారు.   సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత నిచ్చి సుపరిపాలన సాగించేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.  వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. 
భట్టి పద్దులో కేటాయింపులు ఇలా ఉన్నాయి...
- విద్య.. రూ.23,108 కోట్లు
- ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు.. రూ.11,600 కోట్లు
- రైతు భరోసా ..  రూ.18 వేల కోట్లు
- వ్యవసాయం..   రూ.24,439 కోట్లు
- పశుసంవర్థక శాఖ.. రూ.1,674 కోట్లు
- పౌర సరఫరాల శాఖ.. రూ.5,734 కోట్లు
- ఉపాధి కల్పన.. రూ.900 కోట్లు
- పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి.. రూ.31,605 కోట్లు
- స్త్రీ, శిశు సంక్షేమం.. రూ.2,861 కోట్లు

- ఎస్సీ.. రూ.40,232 కోట్లు

- ఎస్టీ.. రూ.17,169 కోట్లు

- బీసీ..  రూ.11,405 కోట్లు

- మైనర్టీ.. రూ.3,591 కోట్లు

- చేనేత - రూ.371 కోట్లు

- ఐటీ - రూ.774 కోట్లు
- హైదరాబాద్ నగర అభివృద్ధి ..రూ.150 కోట్లు
- పారిశ్రామిక రంగం.. రూ.3,525 కోట్లు

- విద్యుత్‌.. రూ.21,221 కోట్లు

- వైద్యరోగ్యం.. రూ.12,393 కోట్లు

- పురపాలక, పట్టణాభివృద్ధి.. రూ.17,677 కోట్లు

- ఇరిగేషన్.. రూ.23,373 కోట్లు

- రోడ్లు భవనాలు.. రూ.5,907 కోట్లు
- టూరిజం.. రూ.775 కోట్లు

- కల్చరల్.. రూ.465 కోట్లు

- అడవులు, పర్యావరణం.. రూ.1,023 కోట్లు

- ఎండోమెంట్స్.. రూ.190 కోట్లు

- లా అండ్ ఆర్డర్.. రూ.10,188 కోట్లు

- ఇందిరమ్మ ఇళ్లు.. రూ.22,500 కోట్లు