కివీస్ పై టీమ్ ఇండియా విజయం.. కోహ్లీ వరల్డ్ రికార్డ్
posted on Jan 12, 2026 2:58AM
.webp)
న్యూజీలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా ఆదివారం (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఎవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. 301 పరుగుల విజయ లక్ష్యంతో ఛేదన చేపట్టిన టీమ్ ఇండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
ఛేదనలో తనకు ఎదురే లేదని కింగ్ విరాట్ కోహ్లీ మరో సారి నిరూపించుకున్నాడు. భారత్ బ్యాటర్లలో ఓపెనర్ రోహిత్ శర్మ 26 పరుగులు చేసి జట్టు స్కోరు 39 వద్ద ఉండగా ఔటయ్యాడు. తరువాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, స్కిప్పర్ శుభమన్ గిల్ తో కలిసి రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో గిల్ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కోహ్లీ మాత్రం తన ఫామ్ కొనసాగించాడు. కోహ్లీ ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ తో 93 పరుగులు చేసి ఔటయ్యాడు.
కోహ్లీ తృటిలో సెంచరీ మిస్సయినప్పటికీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా 28వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాకుండా మొత్తంగా అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. మొదటి స్థానంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.