ఏపీలో పలు జిల్లాలకు కొత్త జేసీలు.. ఐఏఎస్ ల బదలీలు

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు  కొత్త జాయింట్ కలెక్టర్లను  నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా కొత్త జేసీలు నియమితులైన జిల్లాలలో  ఇటీవలే కొత్తగా ఏర్పాటైన   మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులును మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది.

అలాగే  చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గొబ్బిళ్ల విధ్యాధరిని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గానూ, అన్నమయ్య జిల్లా జేసీగా ఉన్న ఆదర్శ రాజేంద్రన్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నూ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కార్యదర్శిగా పని చేస్తున్న గోవిందరావును  టుడా  వైస్ చైర్మన్‌గా నియమించింది. ఆయనకు తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రకాశం జిల్లా జేసీగా ఉన్న గోపాల్ కృష్ణ రోణంకిని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు.   పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజన సింహాను ప్రభుత్వం నియమించింది.
 
రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న బచ్చు స్మరణ్ రాజ్‌కు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu